Share News

Yogita Rana: విద్యా శాఖ కార్యదర్శిగా యోగితా రాణా

ABN , Publish Date - Jan 10 , 2025 | 03:47 AM

కీలకమైన రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శిగా ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న 2003 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిణి యోగితా రాణాను ప్రభుత్వం నియమించింది.

Yogita Rana: విద్యా శాఖ కార్యదర్శిగా యోగితా రాణా

  • రవాణా శాఖ కమిషనర్‌గా సురేంద్ర మోహన్‌

  • శ్రీధర్‌కు గనులు, భూగర్భ వనరుల బాధ్యతలు కూడా

  • పలువురు ఐఏఎస్‌ల బదిలీ

హైదరాబాద్‌, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): కీలకమైన రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శిగా ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న 2003 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిణి యోగితా రాణాను ప్రభుత్వం నియమించింది. ఇదివరకు విద్యా శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న బుర్రా వెంకటేశంను ప్రభుత్వం టీజీపీఎస్సీ చైర్మన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా యోగితా రాణాను విద్యా శాఖ కార్యదర్శి పోస్టులో నియమించింది. ఈ మేరకు సీఎస్‌ శాంతికుమారి గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. గనులు, భూగర్భ వనరుల శాఖ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్‌ను బదిలీ చేసి, రవాణా శాఖ కమిషనర్‌గా నియమించింది. ఈ గనులు, భూగర్భ వనరుల శాఖ కార్యదర్శి అదనపు బాధ్యతలను ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్‌. శ్రీధర్‌కు అప్పగించింది.

Updated Date - Jan 10 , 2025 | 03:47 AM