Road Accident: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్వాకం.. ఎంత పని జరిగింది..
ABN , Publish Date - Feb 23 , 2025 | 08:03 AM
తెలంగాణ: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాకు చెందిన కొంతమంది హైదరాబాద్‌లో జరిగే తమ బంధువుల వివాహ కార్యక్రమానికి వెళ్లేందుకు ట్రావెల్స్ బస్ బుక్ చేసుకున్నారు.

నల్గొండ: మిర్యాలగూడ (Miryalaguda) చింతపల్లి బైపాస్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ (Private Travels) డ్రైవర్ నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాకు చెందిన కొంతమంది హైదరాబాద్‌లో జరిగే తమ బంధువుల వివాహ కార్యక్రమానికి వెళ్లేందుకు ట్రావెల్స్ బస్ బుక్ చేసుకున్నారు. ఈ మేరకు శనివారం బయలుదేరి వెళ్లిన వారంతా పెళ్లి కార్యక్రమంలో సంతోషంగా పాల్గొన్నారు. అనంతరం అదే రోజు రాత్రి నెల్లూరుకు తిరుగు ప్రయాణం అయ్యారు.
రాత్రి వేళ కావడంతో నిద్రమత్తులో బస్సును డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపాడు. మిర్యాలగూడ చింతపల్లి బైపాస్ వద్ద ఎదురుగా వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనక నుంచి బలంగా ఢీకొట్టాడు. దీంతో ట్రాక్టర్ పల్టీలు కొట్టగా.. సమీపంలోని పొలాల్లోకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరోవైపు బస్సులో ఉన్న 12 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన ఇతర వాహనదారులు వెంటనే 108కి సమాచారం అందించారు. అనంతరం క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మహిళ మృతితో ఆమె స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
Srisailam: టన్నెల్‌లో ప్రాణాలు!