Share News

Medipalli Case: చున్నీతో బిగించి, బెడ్‌రూమ్‌లో పడుకోబెట్టి.. ప్రియుడితో కలిసి పక్కాప్లాన్..

ABN , Publish Date - Dec 22 , 2025 | 08:12 PM

అశోక్, పూర్ణిమ దంపతులకు 11 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. సంతోషంగా సాగుతున్న వీరి కుటుంబంలో భార్య కారణంగా సమస్యలు వచ్చిపడ్డాయి. పూర్ణిమ ఇంటి పక్కనే మహేష్ అనే యువకుడు అద్దెకు ఉంటున్నాడు. పూర్ణిమకు, మహేష్‌కు ఏర్పడిన పరిచయం.. చివరకు వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త లేని సమయంలో..

Medipalli Case:  చున్నీతో బిగించి, బెడ్‌రూమ్‌లో పడుకోబెట్టి.. ప్రియుడితో కలిసి పక్కాప్లాన్..

తెలంగాణ మేడ్చల్ జిల్లా మేడిపల్లి బృందావన్‌ కాలనీలోని ఓ ప్లే స్కూల్‌లో డిసెంబర్‌ 12న అశోక్‌ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తన భర్త గుండెపోటుతో మరణించాడని భార్య చెప్పడంతో అంతా అదే నిజమని అనుకున్నారు. అయితే పోస్టుమార్టంలో రిపోర్టులో హత్య చేసినట్లు తెలిసింది. దీంతో మృతుడి భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని లోతుగా విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.


పోలీసుల కథనం మేరకు.. అశోక్, పూర్ణిమ దంపతులకు 11 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. సంతోషంగా సాగుతున్న వీరి కుటుంబంలో భార్య కారణంగా సమస్యలు వచ్చిపడ్డాయి. పూర్ణిమ ఇంటి పక్కనే మహేష్ అనే యువకుడు అద్దెకు ఉంటున్నాడు. పూర్ణిమకు, మహేష్‌కు ఏర్పడిన పరిచయం.. చివరకు వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త లేని సమయంలో పూర్ణిమ, మహేష్ కలుసుకునేవారు. అయితే ఇటీవల ఓ రోజు వారి వివాహేతర సంబంధం భర్తకు తెలిసింది. పద్ధతి మార్చుకోవాలంటూ భార్యను పలుమార్లు హెచ్చరించాడు. అయినా పూర్ణిమ తన పద్ధతి మార్చుకోలేదు.

criem.jpg


రోజూ భర్త మందలిస్తుండడంతో చివరకు పూర్ణిమ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ప్రియుడితో కలిసి తన భర్త హత్యకు ప్లాన్ చేసింది. చివరకు ఇద్దరూ కలిసి హత్యకు కుట్ర పన్నారు. ఇద్దరూ కలిసి భర్త మెడకు 3 చున్నీలు బిగించి హత్య చేశారు. తర్వాత మృతదేహాన్ని బెడ్ రూమ్‌లో పడుకోబెట్టారు. తన భర్తకు గుండెపోటు వచ్చి పడిపోయాడని, అశోక్ సోదరికి ఫోన్ చేసి చెప్పింది. సోదరి వచ్చి చూసే సరికి అశోక్.. బెడ్‌పై అచేతనంగా పడి ఉన్నాడు. అయితే శరీరంపై దెబ్బలు ఉండటంతో అశోక్ సోదరి ప్రశ్నించింది. బాత్ రూమ్‌లో కింద పడ్డాడు అని పూర్ణిమ కప్పిపుచ్చింది. తర్వాత అశోక్ మృతదేహానికి పోస్ట్‌మార్టం జరగకుండా.. పూర్ణిమ అడ్డుకునే ప్రయత్నం చేసింది.

women-viral.jpg


మహేష్ కూడా ఆస్పత్రి వద్దకు వచ్చి.. పోస్ట్ మార్టం వద్దు అని అశోక్ కుటుంబ సభ్యులకు చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో వైద్యులు హత్యగా తేల్చారు. పోలీసులు పూర్ణిమను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిన్నటితో అశోక్ దశ దిన కర్మ పూర్తైంది. అయితే ఈ పది రోజుల పాటు పూర్ణిమ ఎలాంటి అనుమానం రాకుండా నటించింది. అయితే ఈ 10 రోజుల్లో మహేష్‌తో అనేక సార్లు చాట్ చేసింది. అలాగే మూడు రోజుల క్రితం మహేష్‌తో కలిసి షాపింగ్‌కి కూడా వెళ్లినట్లు విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Dec 22 , 2025 | 08:42 PM