Share News

Nirmal Crime: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

ABN , Publish Date - Aug 27 , 2025 | 03:54 AM

వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని.. కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్య చేసిన ఘటన నిర్మల్‌ జిల్లాలో జరిగింది. ఈ నెల 22న జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Nirmal Crime: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

  • వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని..

  • నిర్మల్‌ జిల్లాలో దారుణం

సోన్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని.. కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్య చేసిన ఘటన నిర్మల్‌ జిల్లాలో జరిగింది. ఈ నెల 22న జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోన్‌ మండలం న్యూ వెల్మల్‌ గ్రామంలో నివాసముండే తిరునగరి నాగలక్ష్మికి 30ఏళ్ల క్రితం హరిచరణ్‌తో వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. అయితే, అదే గ్రామానికి చెందిన అంకం మహే్‌శ తో నాగలక్ష్మీ వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.


ఈ విషయం భర్తకు తెలియడంతో వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రియుడితో కలిసి గొంతుని టవల్‌తో చుట్టి ఊపిరాడకుండా చేసి భర్తను హత్య చేసింది. హరిచరణ్‌కు మూర్చ వచ్చిందని, బాత్రూంలో కాలు జారిపడి మృతి చెందాడని బంధువులను నమ్మించింది. ఈ ఘటనపై ఫిర్యాదు రావడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులు నాగలక్ష్మీ, మహేశ్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. హరిచరణ్‌ మరణాన్ని తప్పుదోవ పట్టించిన ఆర్‌ఎంపీ వైద్యుడు రమేష్‌ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

లిక్కర్ స్కామ్‌లో నిందితులకు మళ్లీ రిమాండ్ పొడిగింపు

ఈ రాశుల వారు.. ఈ మంత్రాలు చదివితే దశ..

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 27 , 2025 | 03:54 AM