Share News

Wedding Rush 2025: ముంచుకొస్తోంది ముహూర్తాల వేళ

ABN , Publish Date - Apr 18 , 2025 | 04:15 AM

తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి ముహూర్తాలు మళ్లీ ఊపందుకుంటున్నాయి ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో మాత్రమే కొన్ని పరిమితమైన శుభ రోజులు ఉన్నాయి

Wedding Rush 2025: ముంచుకొస్తోంది ముహూర్తాల వేళ

  • తెలుగు రాష్ట్రాల్లో ఊపందుకోనున్న పెళ్లిళ్లు

  • ఈ నెలలో 18, 20, 23, 30వ తేదీల్లో.. మేలో 11 రోజులు

  • జూన్‌లో 4 రోజులే.. మళ్లీ జూలై 26 తర్వాత 10 రోజులు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): వివాహ ముహూర్తాలు ఉన్నాయి.. అలా అని ఎక్కువగా లేవు! అందుకే.. పెళ్లి చూపులు.. వివాహ నిశ్చితార్థాలు జరిగిన జంటలకు పెళ్లి పీటలెక్కించేందుకు ఈ మంచి తరుణం మించిన దొరకదు. అషాఢం వచ్చేస్తుండటంతో ఆలోపే చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసాల్లో ఉన్న కొద్దిపాటి ముహూర్తాల్లో పెళ్లిళ్లు చేసేందుకు పెద్దలు నిర్ణయిం తీసుకుంటున్నారు. ఫలితంగా తెలంగాణ, ఏపీలో మళ్లీ పెళ్లిళ్ల సందడి ఇక జోరందుకోనుంది. వాస్తవానికి ఈనెల 12నే శుభ ముహూర్తాలు మొదలయ్యాయి. ఈనెలలో 18, 20, 23, 30 తేదీల్లోనే ముహుర్తాలు మిగిలి ఉన్నాయి. మే నెల ఫస్ట్‌ తారీఖు నుంచి 28వ తేదీ వరకు 11 రోజులే ముహుర్తాలున్నాయి.


తర్వాత జూన్‌లో కేవలం 4 రోజులే శుభ ముహుర్తాలున్నాయి. తర్వాత వచ్చేది ఆషాఢమాసం.. పెళ్లిళ్ల ముచ్చటే ఉండదు. జూలైలో 26 నుంచి ఆగస్టు 18 వరకు కొన్ని ముహుర్తాలున్నాయి. ఆగష్టు-సెప్టెంబరులో శూన్య మాసం ఉండటంతో సెప్టెంబరు 22వ తేదీ నుంచి కొన్నే మంచిరోజులున్నాయి. తర్వాత నవంబరు 20న.. ఆ తర్వాత కొన్ని రోజులే పెళ్లిళ్లకు అనువైన ముహూర్తాలున్నాయి. ఈ రోజులు ముగిస్తే ఇక వచ్చే ఏడాది 15వ తేదీ వరకు ముహూర్తాలేలేవు. మొత్తమ్మీద కొన్ని ముహూర్తాలే ఉండటంతో కల్యాణ మండపాలు, ఫంక్షన్‌ హాళ్లకు డిమాండ్‌ పెరిగింది. కాగా పెళ్లిళ్ల ఖర్చుల విషయంలో అమ్మాయి, అబ్బాయి తరపు వాళ్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారని పురోహితులు, ఫంక్షన్‌హాళ్లు యజమానులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

తరగతి గదిలో పెచ్చులూడి పడి..

ప్రైవేట్‌ ఆస్పత్రి పొమ్మంటే.. సర్కారు దవాఖానా ప్రాణాలు నిలిపింది

దుబాయిలో అసలేం జరిగింది..?

తెలంగాణ పోలీసులకు సీఎం అభినందనలు

ఫస్ట్ టైం తెలుగులో...

Read Latest Telangana News and National News

Updated Date - Apr 18 , 2025 | 04:16 AM