Share News

Bhupalpally Leopard: గొర్రెల మందపై చిరుత దాడి.. చివరకు చెట్టుపై..

ABN , Publish Date - Oct 26 , 2025 | 07:47 AM

గొర్రెల యజమాని మేడిపల్లి రామయ్య సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడి చేసిన జంతువు పాదముద్రలు గుర్తించి చిరుతపులిగా నిర్ధారించారు.

Bhupalpally Leopard: గొర్రెల మందపై చిరుత దాడి.. చివరకు చెట్టుపై..
Leopard Attack

జయశంకర్ భూపాలపల్లి: మహాముత్తారం మండలంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. జీలపల్లి గ్రామ పరిధిలోని పర్లపల్లి సమీపంలో గొర్రెల మందపై శనివారం రాత్రి చిరుతపులి దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. గొర్రెల మందను యజమాని మేడిపల్లి రామయ్య షెడ్డులోకి తోలి రాత్రికి ఇంటికి వెళ్లాడు. తిరిగి ఇవాళ(ఆదివారం) తెల్లవారుజామున షెడ్డుకు వచ్చి చూసేసరికి గొర్రెలు అన్ని చెల్లాచెదురై, గాయాలతో పడి ఉన్నాయి. అందులో రెండు గొర్రెలు మృతి చెందినట్లు రామయ్య తెలిపాడు. గొర్రెల మందపై చిరుతపులి దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేశాడు. అనంతరం సమీపంలోని చెట్టుపై ఒక గొర్రె కళేబరం కనపడటంతో.. తీవ్ర భయాందోళనకు గురై వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చాడు.


గొర్రెల యజమాని మేడిపల్లి రామయ్య సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడి చేసిన జంతువు పాదముద్రలు గుర్తించి చిరుతపులిగా నిర్ధారించారు. అనంతరం చనిపోయిన, గాయపడిన గొర్రెలను పరిశీలించారు. చిరుత గొర్రెలమందపై దాడితో చుట్టూ ప్రక్క గ్రామాల ప్రజలు, రైతులు, పశు కాపర్లు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అడవులకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. చిరుతపులి ఆనవాళ్లు కనిపిస్తే పారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.


ఇవి కూడా చదవండి..

Investment in Adani Raises: జీవిత బీమా..అదానీకి ధీమా

Congress Demands: పీఏసీ దర్యాప్తు జరగాలి కాంగ్రెస్‌

Updated Date - Oct 26 , 2025 | 07:49 AM