Warangal Former: అధికారులు మొద్దునిద్ర వీడండి.. కాంగ్రెస్ సర్కార్‌పై పత్తి రైతు ఆగ్రహం
ABN , Publish Date - Aug 30 , 2025 | 08:16 AM
రాష్ట్రంలో యూరియా కొరత సమస్య కొనసాగుతోంది. అక్కడక్కడా సరఫరా జరుగుతున్నా.. సరిపడా నిల్వలు అందుబాటులో లేక రైతుల అవసరం తీరడం లేదు. వరంగల్ జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా ఉందని రైతులు చెబుతున్నారు.
వరంగల్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న యూరియా కొరతపై రాష్ట్ర రైతాంగం మొత్తం కాంగ్రెస్ సర్కార్‌పై అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రైతులు వివిధ రూపాల్లో వారి ఆవేదనను.. తెలుపుతున్నారు. కొందరు రైతులు ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడినా ఘటనలు మనం చూస్తున్నాం. యూరియా దుకాణాల ముందు.. రోజుల తరబడి నిల్చున్న యూరియా దొరికని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసిన పంట చెడిపోతే తమకు చావే శరణమని గుండెలు బాదుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ రైతు కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు.
రాష్ట్రంలో యూరియా కొరత సమస్య కొనసాగుతోంది. అక్కడక్కడా సరఫరా జరుగుతున్నా.. సరిపడా నిల్వలు అందుబాటులో లేక రైతుల అవసరం తీరడం లేదు. వరంగల్ జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా ఉందని రైతులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పర్వతగిరి మండలం ఏబీ తండాలో రేవంత్ సర్కార్‌పై రైతు భూక్య బాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా దొరక్క విసుగెత్తి పత్తి చేనుని పీకిపారేశాడు. రైతు బాలు అతని కుటుంబ సభ్యులు కలిసి చేనును పీకేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు మొద్దునిద్ర వీడి యూరియా కొరత తీర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇన్‌ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య
గణేశుడి మండపం వద్ద కరెంట్ షాక్‌తో బాలుడి మృతి