Share News

Hanumakonda: జిల్లాలో కలకలం సృష్టిస్తున్న మావోయిస్టు లేఖ.. ఆ భూములు కబ్జా చేశారంటూ..

ABN , Publish Date - Feb 03 , 2025 | 07:48 PM

అజాం జాహి మిల్లు భూములకు సంబంధించి హైకోర్టు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్, వరంగల్ వాసి సుద్దాల నాగరాజు తప్పుడు ప్రతాలు సృష్టించారని మావోయిస్టు నేతలు ఆరోపించారు. ఆ తప్పుడు పత్రాలతో వారు మిల్లు భూములు అమ్మేసి డబ్బులు దండుకున్నారని మండిపడ్డారు.

Hanumakonda: జిల్లాలో కలకలం సృష్టిస్తున్న మావోయిస్టు లేఖ.. ఆ భూములు కబ్జా చేశారంటూ..
Maoists Letter

హనుమకొండ: అజాం జాహి మిల్లు (Azam Jahi Mill) భూములు అన్యాక్రాంతం అయ్యాయంటూ మావోయిస్టులు (Maoists) విడుదల చేసిన లేఖ కలకలం సృష్టిస్తోంది. అజాం జాహి మిల్లు కార్మికులకు సంబంధించిన భూములను కొత్త మంది వ్యక్తులు అమ్ముకున్నారంటూ జయశంకర్, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి (JMWP) డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేశ్ (Venkatesh) పేరుతో లేఖ విడుదలైంది. హైకోర్టు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్, వరంగల్ వాసి సుద్దాల నాగరాజు మిల్లుకు సంబంధించిన కార్మిక భవనం, భూమి విషయంలో తప్పుడు పత్రాలు సృష్టించారని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. ఆ పత్రాలతో కార్మికుల భూమిని నమశ్శివాయ అనే వస్త్ర వ్యాపారికి అమ్మేశారని ఆరోపించారు. అజాం జాహి మిల్లుకు సంబంధించిన భూములు, భవనంతోపాటు విలువైన డాక్యుమెంట్లను సైతం అమ్మేశారని ఆరోపించారు.


వరంగల్‌కు చెందిన సుద్దాల నాగరాజు అసంఘటిత కార్మిక సంఘం పేరుతో చలామణి అవుతూ అక్రమంగా ఆస్తులు కూడబెట్టాడని ఆగ్రహించారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అజాం జాహి భూముల కబ్జాదారులను శిక్షించకుండా కొమ్ముకాస్తోందంటూ మండిపడ్డారు. పోలీసులకు కార్మికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కబ్జాదారులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని ఆ భూమిని తిరిగి కార్మికులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రజలు, ప్రజాస్వామికవాదులు కార్మికుల పోరాటానికి మద్దతు ఇవ్వాలని పేర్కొన్నారు. కాగా, రాజకీయ, వ్యాపార వర్గాల్లో మావోయిస్టుల లేఖ కలకలం రేపుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Manchu Family: మేజిస్ట్రేట్ ముందు తిట్టుకొన్న మోహన్ బాబు, మనోజ్

Hyderabad: ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఎస్సీ వర్గీకరణ ఏక సభ్య కమిషన్‌, క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ..

Updated Date - Feb 03 , 2025 | 07:51 PM