Share News

Hyderabad: వీసా గడువు ముగిసినా.. ఇంకా నగరంలోనే తిష్ఠ

ABN , Publish Date - Mar 06 , 2025 | 11:14 AM

వీసా గడువు ముగిసినా నగరంలో అక్రమంగా ఉంటూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ముగ్గురు విదేశీయులను వెస్ట్‌జోన్‌ పోలీసులు(West Zone Police) అదుపులోకి తీసుకుని వారి దేశాలకు పంపించారు. లైబీరియాకు చెందిన కర్మో మార్టిన్‌ స్టూడెంట్‌ వీసాపై 2019లో నగరానికి వచ్చాడు.

Hyderabad: వీసా గడువు ముగిసినా.. ఇంకా నగరంలోనే తిష్ఠ

- ముగ్గురిని వారి దేశాలకు పంపించిన పోలీసులు

హైదరాబాద్‌ సిటీ: వీసా గడువు ముగిసినా నగరంలో అక్రమంగా ఉంటూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ముగ్గురు విదేశీయులను వెస్ట్‌జోన్‌ పోలీసులు(West Zone Police) అదుపులోకి తీసుకుని వారి దేశాలకు పంపించారు. లైబీరియాకు చెందిన కర్మో మార్టిన్‌ స్టూడెంట్‌ వీసాపై 2019లో నగరానికి వచ్చాడు. నిజాం కళాశాల(Nizam College)లో 2020 నుంచి 2023 వరకు చదువుకున్నాడు. బ్యాక్‌ లాగ్‌లు ఉన్నాయని తప్పుడు సమాచారం ఇస్తూ వీసాను పొడిగించుకుంటున్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: Trains: 28 ఏఈఎంయూ-డీఈఎంయూ రైళ్లు రద్దు.. కారణం ఏంటంటే..


సీసీఎస్‌ అధికారులు అతడిని అదుపులోకి తీసుకొని ఫిబ్రవరి 26న లెబనాన్‌కు పంపించారు. ఉగాండా(Uganda)కు చెందిన పి కబటుకు మేరీ అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాలంటూ మెడికల్‌ వీసాపై 2024 డిసెంబర్‌లో నగరానికి వచ్చింది. నగరంలో ఉంటూ వ్యభిచారం చేస్తుండగా సీసీఎస్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. విచారణలో మెడికల్‌ వీసాపై వచ్చిన మేరీ ఇప్పటి వరకు అపోలో ఆస్పత్రికి వెళ్లలేదని తెలుసుకున్నారు.


city9.2.jpg

ఆమెను ఈనెల 4న ఉగాండాకు తిరిగి పంపించారు. నైబీరియాకు చెందిన స్టూడెంట్‌ వీసాపై 2022లో నగరానికి వచ్చాడు. ఏవీ కాలేజ్‌లో చదువుకునేందుకు వీసా తీసుకున్న ఇతడు కనీసం అడ్మిషన్‌ కూడా తీసుకోకుండా అక్రమంగా ఉంటున్నాడు. వ్యభిచార గృహం నిర్వహణ కేసులో సీసీఎస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతడిని ఈనెల 5న లైబీరియాకు పంపించారు.


ఈ వార్తను కూడా చదవండి: BJP victory: బీజేపీదే గెలుపు

ఈ వార్తను కూడా చదవండి: ఎస్సీ వర్గీకరణ.. బీసీ రిజర్వేషన్ల పెంపు!

ఈ వార్తను కూడా చదవండి: సీతారామ’తో ఖమ్మం జిల్లా సస్యశ్యామలం

ఈ వార్తను కూడా చదవండి: Heatwave: భానుడి భగభగలు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 06 , 2025 | 02:05 PM