Share News

Khairatabad: ఖైరతాబాద్‌ గణపతి వద్ద భారీ బందోబస్తు..

ABN , Publish Date - Aug 26 , 2025 | 11:03 AM

ప్రతిరోజూ లక్ష నుంచి రెండు లక్షల మంది భక్తులు ఖైరతాబాద్‌ గణపతి వద్దకు వస్తుంటారు. ఇక వారాంతపు రోజులైన శని, ఆదివారాల్లో ఈ సంఖ్య 3 నుంచి 5 లక్షల వరకు ఉంటుంది. ఈసారి ఇంతకు మించి భక్తులు వస్తారనే అంచనాల నేపథ్యంలో ఖైరతాబాద్‌ గణపతి వద్ద పోలీసులు ఎప్పుడూ లేనంత బందోబస్తును నిర్వహించనున్నారు.

Khairatabad: ఖైరతాబాద్‌ గణపతి వద్ద భారీ బందోబస్తు..

హైదరాబాద్: ప్రతిరోజూ లక్ష నుంచి రెండు లక్షల మంది భక్తులు ఖైరతాబాద్‌(Khairatabad) గణపతి వద్దకు వస్తుంటారు. ఇక వారాంతపు రోజులైన శని, ఆదివారాల్లో ఈ సంఖ్య 3 నుంచి 5 లక్షల వరకు ఉంటుంది. ఈసారి ఇంతకు మించి భక్తులు వస్తారనే అంచనాల నేపథ్యంలో ఖైరతాబాద్‌ గణపతి వద్ద పోలీసులు ఎప్పుడూ లేనంత బందోబస్తును నిర్వహించనున్నారు. ఈ విషయమై సైఫాబాద్‌ ఏసీపీ ఆర్‌. సంజయ్‌కుమార్‌ వివరాలను మీడియా ప్రతినిధులకు వెల్లడించారు.


ఇక్కడ ఆరుగురు డీఎస్పీలు, 23 మంది ఇన్‌స్పెక్టర్లు, 52 మంది ఎస్‌ఐలు, 150 మంది కానిస్టేబుళ్లు, 50 మంది మహిళా కానిస్టేబుళ్లు, 22 ప్లటూన్ల సిబ్బందిని వినయోగిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రోజూ తరచుగా డాగ్‌ స్క్వాడ్‌, బాంబ్‌ స్క్వాడ్‌ బృందాలు తనిఖీలు చేస్తాయని, 60 సీసీ కెమెరాల ద్వారా భక్తుల భద్రతను సమీక్షిస్తామని తెలిపారు. అన్ని మార్గాల్లో డోర్‌ ఫ్రేం, హ్యాండ్‌ మెటల్‌ డిటెక్టర్లతో భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు.


city7.2.jpg

ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకే దర్శనానికి అనుమతి ఉంటుందన్నారు. భక్తులు విలువైన ఆభరణాలను, వస్తువులను తీసుకొని రాకూడదని తెలిపారు. ఉత్సవ కమిటీల ప్రతినిధులు అతిథులు, వీఐపీలను సాధ్యమైనంత వరకు ఉదయం నుంచి మధ్యాహ్నంలోపే వచ్చేలా ఆహ్వానించాలని కోరారు.


100 మంది ప్రైవేట్‌ సెక్యూరిటీ..

ఉత్సవ కమిటీ తరఫున 100 మంది ప్రైవేట్‌ సెక్యూరిటీ సిబ్బందిని తమకు అందించాలని పోలీసులు కోరారు. తమ సిబ్బందికి అదనంగా వారి సేవలను 3 షిఫ్టుల్లో వాడుకుంటామని, మొత్తం 100 మందిని తమకు అప్పగిస్తే వారికి పోలీసు అధికారులు అవసరం మేరకు వినియోగించుకుంటారని ఏసీపీ సంజయ్‌ కుమార్‌ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి ధరల్లో తగ్గుదల.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..

ఆ అరగంటలోనే నగలు ఎత్తుకెళ్లారు..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 26 , 2025 | 11:03 AM