Share News

Amit Shah: హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి అమిత్ షా.. శోభాయాత్రపై పోలీసుల హైఅలర్ట్

ABN , Publish Date - Sep 02 , 2025 | 12:11 PM

భాగ్యనగరంలో సెప్టెంబర్ 6న జరిగే గణేష్ నిమజ్జన శోభాయాత్రకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాబోతున్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు.

Amit Shah: హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి అమిత్ షా..  శోభాయాత్రపై పోలీసుల హైఅలర్ట్
Amit Shah

హైదరాబాద్, సెప్టెంబర్ 2: భాగ్యనగరంలో సెప్టెంబర్ 6న జరిగే గణేష్ నిమజ్జన శోభాయాత్రకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాబోతున్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. సెప్టెంబర్ 6 ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ లో అమిత్ షా దిగనున్నారు. ఉదయం 11.30 గంటల నుంచి 12.30 వరకు ITC కాకతీయలో బీజేపీ ముఖ్యనేతలతో సమావేశమవుతారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు చార్మినార్ దగ్గర వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3.30కి ఎంజే మార్కెట్ దగ్గర నిమజ్జన శోభాయాత్రలో పాల్గొని ఆయన ప్రసంగిస్తారు. చార్మినార్ దగ్గర కూడా అమిత్ షా ప్రసంగించే అవకాశం ఉంది.


శోభాయాత్ర జ‌రిగే మార్గాల్లో పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అయితే, అమిత్ షా పర్యటన ఖరారు కావడంతో మరిన్ని ఆంక్షలు విధించే అవకాశాలున్నాయి. నగరంలో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కేసీఆర్, హరీష్ రావు మధ్యంతర పిటిషన్లపై కొన్ని ఘడియల్లో విచారణ

తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు

For More TG News And Telugu News

Updated Date - Sep 02 , 2025 | 01:15 PM