Tummla: ఎకరం కూడా ఎండొద్దు
ABN , Publish Date - Mar 09 , 2025 | 02:56 AM
యాసంగి సీజన్‌లో ఎకరం పంట కూడా ఎండటానికి వీలు లేదని, ఇరిగేషన్, వ్యవసాయాధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.

సాగునీటి సమస్య రాకూడదు: తుమ్మల
ఉమ్మడి నల్లగొండ జిల్లా సమీక్ష పాల్గొన్న మండలి చైర్మన్‌గుత్తా,మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ, మార్చి 8 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): యాసంగి సీజన్‌లో ఎకరం పంట కూడా ఎండటానికి వీలు లేదని, ఇరిగేషన్, వ్యవసాయాధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో శనివారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వేసవి కార్యాచరణ ప్రణాళకపై సమీక్షా సమావేశం జరిగింది. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఇరిగేషన్ ఇంజనీర్లు నిత్యం ప్రాజెక్టులపై పర్యవేక్షణ చేయాలని, క్షేత్రస్థాయిలో కాల్వలపై పర్యటించాలన్నారు. అందుబాటులో ఉన్న సాగునీరు రైతులకు అందించడానికి పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
వేసవి ముగిసేంత వరకు అవసరమైన తాగునీరు మిషన్‌భగీరథ పథకం ద్వారా అందించేందుకు ఇబ్బంది లేదని, సరఫరా ఇబ్బందులు లేకుండా ఈఎన్‌సీ స్థాయిలో దృష్టి సారించాలన్నారు. మండలి చైర్మన్ సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రాజెక్టుల కాల్వలపై వందలాది మోటార్లు ఏర్పాటు చేయడంతో దిగువ ఆయకట్టుకు నీరందడం లేదని, వీటిని క్రమబద్ధీకరించాల్సి ఉందన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇరిగేషన్, విద్యుత్, తాగునీటి సమస్యలు రాకుండా అధికారులు వేసవి ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో..
Car Accident: అంతా చూస్తుండగానే అదుపుతప్పిన కారు.. క్షణాల్లోనే..