ECET Counselling: నేటి నుంచి ఈసెట్ కౌన్సెలింగ్..!
ABN , Publish Date - Jun 17 , 2025 | 04:47 AM
ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈసెట్)-2025లో ర్యాంకులు పొందిన అభ్యర్థులకు మంగళవారం నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
ధ్రువపత్రాల పరిశీలనకు 8,647 మంది స్లాట్ బుకింగ్
హైదరాబాద్ సిటీ, జూన్16 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈసెట్)-2025లో ర్యాంకులు పొందిన అభ్యర్థులకు మంగళవారం నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా ధ్రువపత్రాల పరిశీలన నిమిత్తం 8,647 మంది అభ్యర్థులు స్లాట్‌లు బుక్ చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 20 హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆరు హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సాంకేతిక విద్యా కమిషనర్ దేవసేన తెలిపారు. హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన అనంతరం వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. మెరుగైన కళాశాలల్లో సీట్లు పొందేందుకు అభ్యర్థులు వెబ్ కౌన్సెలింగ్‌లో వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఎంచుకోవాలని సూచించారు. వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ ఈ నెల 21న ముగియనుండగా, 25లోగా తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుందని వెల్లడించారు. మరిన్ని వివరాలకు టీజీఈసెట్.ఎన్‌ఐసీ.ఇన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
నీట్ యూజీ సీట్ల కేటాయింపుపై బుక్‌లెట్ విడుదల
హైదరాబాద్ సిటీ, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): వైద్యవిద్యా కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ (యూజీ)-2025లో ర్యాంకులు సాధించిన విద్యార్థుల అవగాహన కోసం గత సంవత్సరం (నీట్-2024)లో సీట్ల కేటాయింపుపై రూపొందించిన డిజిటల్ బుక్‌లెట్‌ను సిద్ధం చేసినట్లు ఐఐటీ-జేఈఈ/నీట్ ఫోరం తెలిపింది. ఈ బుక్‌లెట్ ద్వారా ఎంబీబీఎస్, బీడీఎ్‌సలలో మూడు రౌండ్ల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో ర్యాంకుల వారీగా, రిజర్వేషన్ల వారీగా సీట్ల కేటాయింపు, ఓపెనింగ్, క్లోజింగ్ ర్యాంకుల వివరాలను పొందుపరిచామని చెప్పారు. ఈ డిజిటల్ బుక్‌లెట్‌ను పొందాలనుకునే వారు మరింత సమాచారం కోసం వాట్సాప్ నంబర్ 98490 16661కు సంప్రదించాలని ఫోరం తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి
గోడలు దూకేందుకు బీజేపీ నేతల యత్నం.. జీహెచ్‌ఎంసీ వద్ద టెన్షన్ టెన్షన్
కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం
Read Latest Telangana News And Telugu News