Share News

Financial Crisis: కేటాయింపులు ఘనం.. నిధుల విడుదల శూన్యం

ABN , Publish Date - Aug 16 , 2025 | 03:37 AM

రాష్ట్రంలోని గిరిజనుల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణ షెడ్యూల్డ్‌ తెగల ఆర్థిక సహకార సంస్థ (ట్రైకార్‌) తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

Financial Crisis: కేటాయింపులు ఘనం.. నిధుల విడుదల శూన్యం

కాగితాలకే పరిమితమైన ట్రైకార్‌ బడ్జెట్‌

  • పదేళ్లుగా నిధుల కోసం గిరిజనుల నిరీక్షణ

  • దెబ్బతిన్న విద్య, ఉపాధి, వ్యవసాయ రంగాలు

  • గిరిజన ఆవాసాల్లో మౌలిక సదుపాయాల కొరత

హైదరాబాద్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గిరిజనుల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణ షెడ్యూల్డ్‌ తెగల ఆర్థిక సహకార సంస్థ (ట్రైకార్‌) తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆర్థిక మద్దతు పథకాలను అమలు చేసే ట్రైకార్‌కు ప్రభుత్వాలు బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు చేస్తున్నా.. నిధుల విడుదల విషయంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. గత పదేళ్లుగా నిధుల విడుదలలో జాప్యం కారణంగా అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు మధ్యలోనే నిలిచిపోయాయి. విద్య, ఉపాధి, వ్యవసాయ రంగాలు దెబ్బతిన్నాయి. గిరిజన విద్యార్థులకు సకాలంలో స్కాలర్‌షి్‌పలు అందకపోవడంతో వారి ఉన్నత చదువులకు ఆటంకం కలుగుతోంది. యువతకు రుణ సదుపాయం, స్వయం ఉపాధి కోసం శిక్షణ కార్యక్రమాలు, చిన్న వ్యాపారాలు, సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల (ఎంఎ్‌సఎంఈ) ఏర్పాటుకు ఆర్థిక సహాయం వంటి పథకాలు నిలిచిపోవడంతో నిరుద్యోగ సమస్య తీవ్రమవుతోంది. గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కుంటుపడింది. గిరిజన రైతులకు అవసరమైన వ్యవసాయ పరికరాలు అందించడం, గిరిజన రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ఆర్థిక మద్దతు, మార్కెట్‌ యాక్సె్‌సను ప్రోత్సహించడానికి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ మార్కెట్‌ ఏర్పరచడం వంటి కార్యక్రమాల అమలు నిలిచిపోయింది. రహదారులను మెరుగుపరచడం, గ్రామీణ రవాణా కార్యక్రమాల ద్వారా జీవనోపాధితోపాటు తాగునీటి సౌకర్యాలు కల్పించడం వంటి ప్రాథమిక అవసరాలు కూడా తీరడంలేదు. బడ్జెట్‌ కేటాయింపులు కాగితాలపై కనిపించినా.. ఆ నిధులు క్షేత్రస్థాయిలో గిరిజనులకు చేరడంలేదనే విమర్శలున్నాయి.


బడ్జెట్‌లో భారీగా చూపిస్తున్నా..

ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ప్రతి ఆర్థిక సంవత్సరంలో గిరిజన సంక్షేమానికి బడ్జెట్‌లో భారీ మొత్తాలు కేటాయిస్తున్నారు. కానీ, కేటాయించిన నిధుల్లో విడుదలవుతున్నది మాత్రం అతి తక్కువ శాతమే. ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) బడ్జెట్‌లో ప్రభుత్వం ట్రైకార్‌కు రూ.2300 కోట్లు కేటాయించింది. కానీ, ఇప్పటివరకు ఒక్క రూపాయ కూడా విడుదల చేయలేదు. ఈ కేటాయింపుల్లో రాజీవ్‌ యువ వికాసం పథకానికి రూ.1360 కోట్లు, గిరిజనుల భూమి అభివృద్ధికి తీసుకొచ్చిన ఇందిరా గిరి జలవికాసానికి రూ.600 కోట్లు ఖర్చుచేయాల్సి ఉంది. కాగా, 2024-25లోనూ 360 కోట్లు కేటాయించినా.. ఒక్క పైసా విడుదల కాలేదు. ఆ నిధులను కూడా ఈ ఏడాది విడుదల చేసి ఖర్చు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని ట్రైకార్‌ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాజ్‌భవన్‌‌లో ఎట్ హోమ్.. హాజరైన సీఎం, డిప్యూటీ సీఎం దంపతులు

ఫామ్‌హౌస్‌కు చేరుకున్న కవిత

ఆవకాయ పెట్టాలన్నా.. అంతరిక్షంలోకి వెళ్లాలన్నా..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 16 , 2025 | 03:37 AM