Share News

Hyderabad: 9,10 తేదీల్లో సూరారం- బహదూర్‌పల్లి మార్గంలో ట్రాఫిక్‌ మళ్లింపు

ABN , Publish Date - Feb 07 , 2025 | 06:55 AM

సూరారంలోని బాలానగర్‌ - నర్సాపూర్‌(Balanagar - Narsapur) ప్రధాన రహదారిలో ఉన్న కట్టమైసమ్మ అమ్మవారి బోనాల జాతర నేపథ్యంలో సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు(Cyberabad Traffic Police) ప్రత్యేకంగా ట్రాఫిక్‌ మళ్లింపు చర్యలు చేపట్టారు.

Hyderabad: 9,10 తేదీల్లో సూరారం- బహదూర్‌పల్లి మార్గంలో ట్రాఫిక్‌ మళ్లింపు

- సైబరాబాద్‌ జాయింట్‌ ట్రాఫిక్‌ సీపీ

హైదరాబాద్‌ సిటీ: సూరారంలోని బాలానగర్‌ - నర్సాపూర్‌(Balanagar - Narsapur) ప్రధాన రహదారిలో ఉన్న కట్టమైసమ్మ అమ్మవారి బోనాల జాతర నేపథ్యంలో సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు(Cyberabad Traffic Police) ప్రత్యేకంగా ట్రాఫిక్‌ మళ్లింపు చర్యలు చేపట్టారు. ఈనెల 8 నుంచి ప్రారంభమయ్యే జాతరకు 9, 10 తేదీల్లో భక్తులు పెద్ద సంఖ్యలో రానున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు సూరారం-బహదూర్‌పల్లి మార్గంలో ట్రాఫిక్‌ మళ్లింపు చేపడుతున్నారని, ఈ విషయాన్ని వాహనదారులు గుర్తించాలని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: KTR: ఉప ఎన్నికలపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్


కట్టమైసమ్మ, రేణుకా ఎల్లమ్మ అమ్మవార్ల జాతరకు రాజకీయ ప్రముఖులతో పాటు, వీఐపీలు పెద్దసంఖ్యలో హాజరుకానున్నారు. పెద్దమొత్తంలో జాతరకు విచ్చేయనున్న వారికోసం సకల సౌకర్యాలను దేవాలయ కమిటీ సభ్యులు ఏర్పాటుచేశారు. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకోకుండా ముందస్తుగా శాంతి భద్రతల విభాగం పోలీసులు సైతం ప్రత్యేకంగా బందోబస్తు చేపట్టనున్నారని పోలీసులు తెలిపారు. అదేవిధంగా బాలానగర్‌ వైపు నుంచి గండిమైసమ్మకు వచ్చే భారీ వాహనాలను జీడిమెట్ల ఇండస్ర్టియల్‌ ఏరియా మీదుగా దూలపల్లి రోడ్డు,


బహదూర్‌పల్లి క్రాస్‌ రోడ్డు మీదుగా గండిమైసమ్మ రూట్‌కు మళ్లించనున్నారు. అదే సమయంలో గండి మైసమ్మ క్రాస్‌రోడ్డు(Gandi Maisamma Crossroad) వైపు నుంచి వచ్చే భారీ వాహనాలను బహదూర్‌పల్లి జంక్షన్‌ - దూలపల్లివిలేజ్‌ నుంచి జీడిమెట్ల ఇండస్ర్టియల్‌ ఏరియా మీదుగా బాలానగర్‌ కు వెళ్లేలా మళ్లింపు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ మళ్లింపును పరిగణలోకి తీసుకొని ప్రజలు ట్రాఫిక్‌ పోలీసులకు సహకరించాలని సూచించారు.


ఈవార్తను కూడా చదవండి: Mettuguda: ఇంట్లో తల్లి, తనయుడికి కత్తిపోట్లు

ఈవార్తను కూడా చదవండి: Peddapalli: మొదట పరిషత్‌ ఎన్నికలకే మొగ్గు

ఈవార్తను కూడా చదవండి: ఆ రోజు నుంచే ప్రభుత్వ పథకాల జాతర

ఈవార్తను కూడా చదవండి: బస్సు టైరు పేలి ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Read Latest Telangana News and National News

Updated Date - Feb 07 , 2025 | 06:55 AM