SC categorization: 30 ఏళ్ల ఎస్సీ వర్గీకరణ పోరాటం ఫలించింది
ABN , Publish Date - Feb 09 , 2025 | 03:42 AM
మూడు దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ పోరాటానికి ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీతో న్యాయం జరిగిందని టీపీసీసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కొండేటి మల్లయ్య పేర్కొన్నారు. నల్లగొండలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య
నల్లగొండ, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): మూడు దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ పోరాటానికి ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీతో న్యాయం జరిగిందని టీపీసీసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కొండేటి మల్లయ్య పేర్కొన్నారు. నల్లగొండలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటనను నిలబెట్టుకున్నారన్నారు. వర్గీకరణపై నలుగురు మం త్రులతో కమిటీ, హైకోర్టు జడ్జి షమీమ్ అక్తర్‌తో ఏకసభ్య కమిషన్ వేశార ని, కమిషన్ నివేదిక ఇచ్చిన వెంటనే ఈనెల 4న ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో ఆమోదం తెలిపి మాదిగలకు న్యాయం చేశారని చెప్పారు.
దేశంలోనే తెలంగాణలో మొట్టమొదటగా ఎస్సీ వర్గీకరణ అమలు చేసి సీఎం రేవంత్‌రెడ్డి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి, మంత్రి దామోదర రాజనర్సింహకు, మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలిపారు. వర్గీకరణతో మాదిగలకు, మాదిగ ఉపకులాలకు విద్య,ఉద్యోగ అవకాశాల్లో న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.