Bandi Sanjay: న్యూఢిల్లీలోని కేంద్ర మంత్రి కార్యాలయానికి బెదిరింపులు.. రంగంలోకి దిగిన పోలీసులు
ABN , Publish Date - May 08 , 2025 | 09:13 PM
Bandi Sanjay: న్యూఢిల్లీలోని కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయానికి ఓ వ్యక్తి పోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆయన కార్యాలయ అధికారులు వెంటనే స్పందించి.. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబును సంప్రదించారు. దీంతో సీపీ ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగారు.
న్యూఢిల్లీ, మే 08: తాను చెప్పిన పని చేయాలని.. లేకుంటే మీ సంగతి చూస్తాంటూ ఓ అజ్ఝాత వ్యక్తి న్యూఢిల్లీలోని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కార్యాలయానికి గురువారం ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయం వెంటనే స్పందించింది. ఈ బెదిరింపులపై ఆయన కార్యాలయం.. హైదరాబాద్‌లోని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబుకు ఫోన్ చేసి వివరించింది. దాంతో సీపీ సుధీర్ బాబు ఆదేశాల మేరకు.. పోలీసులు రంగంలోకి దిగారు. ఆ క్రమంలో ఈ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి ఎక్కడి నుంచి ఫోన్ చేశాడంటూ.. సెల్ టవర్ల ఆధారంగా విచారణ చేపట్టారు.
దీంతో ఆదిభట్ల పరిధిలోని నాదర్ గుల్ సమీపంలో జయసూర్యనగర్‌కు చెందిన కేపీ రావు.. ఈ ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో కేపీరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తరలించారు. ఆ తర్వాత అతడిని పోలీసులు విచారిస్తున్నారు. అయితే గతంలో సైతం కేపీ రావు.. లంచాల కోసం పలు ప్రభుత్వ కార్యాలయాలతోపాటు పలువురు రాజకీయ నాయకులకు ఈ తరహా ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడే వారని పోలీసుల విచారణలో గుర్తించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
TDP Mahanadu: మహానాడుకు వచ్చే అతిథుల కోసం వసతి ఏర్పాట్లు పూర్తి
Operation Sindoor: దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదు: సీఎం రేవంత్ రెడ్డి
Modakondamma Jathara: మోదకొండమ్మ జాతరకు సర్వం సిద్ధం
CM Chandrababu Security: సీఎం చంద్రబాబు భద్రతపై డీజీపీ కీలక ఆదేశాలు
HYDRAA: హైడ్రా అంటే కొందరికి కడుపు మంట: సీఎం రేవంత్ రెడ్డి
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌లో స్కై స్ట్రైకర్స్ కీలకం
Operation Sindoor: ఈ పాపకు ఆ తల్లిదండ్రులు ఏం పేరు పెట్టారో తెలుసా..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై స్పందించిన పహల్గాం మృతుడి భార్య