Medigadda Barrage: ఎన్‌డీఎస్‌ఏకు మేడిగడ్డ రిపోర్టులు
ABN , Publish Date - Sep 06 , 2025 | 04:12 AM
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో ఏర్పడిన పగుళ్లు, మార్పులపై ఐదు రకాల నివేదికలను నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ)కు తెలంగాణ నీటిపారుదల శాఖ సమర్పించింది.
హైదరాబాద్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో ఏర్పడిన పగుళ్లు, మార్పులపై ఐదు రకాల నివేదికలను నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ)కు తెలంగాణ నీటిపారుదల శాఖ సమర్పించింది. 2023 అక్టోబరు 21న కుంగిపోయిన ఏడో బ్లాక్‌కు సంబంధించిన ఈ నివేదికలను మే 1 నుంచి జూలై 15 వరకు సేకరించారు. వీటిలో 1డీ, 3డీ క్రాక్ మీటర్ మానిటరింగ్, పిజోమీటర్, మెకానికల్ స్కేల్ క్రాక్ మీటర్, ఆప్టికల్ టార్గెట్స్ మానిటరింగ్ రిపోర్టులు ఉన్నాయి. ఈ నివేదికల ఆధారంగా ఎన్‌డీఎ్‌సఏ నిపుణులు ఏడో బ్లాక్‌లోని 11 పిల్లర్ల (పియర్లు) పగుళ్లను విశ్లేషించనున్నారు. గతంలో కూడా విచారణ జరిపిన ఎన్‌డీఎ్‌సఏ, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈ బ్లాక్‌ను పూర్తిగా తొలగించి, కొత్తగా నిర్మించాలని ప్రభుత్వానికి సిఫారసు చేశాయి.
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు రూ.25 కోట్లు
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు ప్రభుత్వం రూ.25 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రంలో బ్రాహ్మణ సంక్షేమానికి 2025-26 బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించిన ప్రభుత్వం అందులో భాగంగా మొదటి విడతగా రూ.25 కోట్లు విడుదల చేసింది. పేద బ్రాహ్మణుల గృహనిర్మాణం, వైద్యం, వ్యాపారం, పిల్లల ఉన్నత విద్య, వివాహం, ఇతర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు అధికారులు ఈ నిధులను వినియోగించనున్నారు. నిధులు విడుదల చేయడం పట్ల సీఎం రేవంత్‌రెడ్డికి పరిషత్ వైస్ చైర్మన్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫలించిన ప్రభుత్వ ప్రయత్నం.. తెలంగాణకు యూరియా రాక..
మద్యం కుంభకోణం కేసులో కీలక పురోగతి
Read Latest TG News and National News