Exams: ఇకపై సీసీ కెమెరాల నిఘాలో ఇంటర్ పరీక్షలు!
ABN , Publish Date - Feb 07 , 2025 | 03:41 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): ఇకనుంచి రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలన్నీ సీసీ కెమెరాల నిఘాలో జరగనున్నాయి. పరీక్షల్లో మరింత పారదర్శకత తీసుకురావాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇంటర్ బోర్డు ఈ దిశగా చర్యలు చేపట్టింది.

హైదరాబాద్, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): ఇకనుంచి రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలన్నీ సీసీ కెమెరాల నిఘాలో జరగనున్నాయి. పరీక్షల్లో మరింత పారదర్శకత తీసుకురావాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇంటర్ బోర్డు ఈ దిశగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఇంటర్ ప్రాక్టికల్స్‌లో తొలిసారి సీసీ కెమెరాలు వినియోగిస్తున్నారు. ఇంటర్ రెండో సంవత్సరం ఎంపీసీ, బైపీసీ విద్యార్థులతో పాటు మొదటి, రెండో ఏడాది ఒకేషనల్ కోర్సు విద్యార్థులకు ఈనెల 3న ప్రారంభమైన ప్రాక్టికల్ పరీక్షలు 22వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
మొత్తం 1,812 కేంద్రాల్లో ఈ పరీక్షలు విడతలవారీగా జరగనున్నాయి. ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్న కేంద్రాల్లో 830 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి.. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేశారు. జిల్లా కేంద్రాలతో పాటు ఇక్కడి కేంద్రంలోని సిబ్బంది పరీక్షలను పర్యవేక్షిస్తారని ఇంటర్ విద్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు.