Share News

Exam Schedule: మే 2న ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్ష

ABN , Publish Date - Feb 04 , 2025 | 04:58 AM

ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎప్‌సెట్‌ పరీక్షలు ఏప్రిల్‌ 29 నుంచి జరగనున్నాయి. ఏప్రిల్‌ 29, 30న అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షలు..

Exam Schedule: మే 2న ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్ష

  • ఏప్రిల్‌ 29, 30న అగ్రికల్చర్‌, ఫార్మసీ ఎంట్రన్స్‌లు

  • జూన్‌ 8, 9న ఐసెట్‌, 16-19 మధ్య పీజీ ఈసెట్‌

  • షెడ్యూల్‌ను ప్రకటించిన ఉన్నత విద్యామండలి

  • ఇకపై ‘కీ’ అభ్యంతరాలకు ప్రశ్నకు రూ.500

హైదరాబాద్‌, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎప్‌సెట్‌ పరీక్షలు ఏప్రిల్‌ 29 నుంచి జరగనున్నాయి. ఏప్రిల్‌ 29, 30న అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షలు.. మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలు ఉంటాయని తెలంగాణ ఉన్నత విద్యామండలి తెలిపింది. ఎప్‌సెట్‌, ఐసెట్‌, పీజీఈసెట్‌ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆచార్య బాలకిష్టారెడ్డి, వైస్‌చైర్మన్లు పురుషోత్తం, ఎస్‌కే.మహమూద్‌, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్‌, ఎప్‌సెట్‌ కన్వీనర్‌ ఆచార్య కుమార్‌ సోమవారం విడుదల చేశారు. ఎప్‌సెట్‌ పరీక్షల నోటిఫికేషన్‌ ఈనెల 20న విడుదల చేస్తామని, 25 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని బాలకిష్టారెడ్డి తెలిపారు. ఏప్రిల్‌ 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అలాగే పీజీ ఈసెట్‌ ప్రవేశ పరీక్ష జూన్‌ 16-19 మధ్య జరగనుంది.


దీనికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ మార్చి 17 నుంచి మే 19 వరకు ఉంటుందని పీజీఈసెట్‌ కన్వీనర్‌ అరుణకుమారి తెలిపారు. ఐసెట్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మార్చి 10న ప్రారంభమై మే 3తో ముగియనుంది. జూన్‌ 8, 9 తేదీల్లో ఈ పరీక్ష జరుగుతుందని ఐసెట్‌ కన్వీనర్‌ ఆచార్య అలువాల రవి తెలిపారు. ఈసారి అన్ని సెట్‌లకు సంబంధించిన ‘కీ’ విషయంలో కొత్త మార్పు చోటుచేసుకుంది. కీపై అభ్యర్థులు అభ్యంతరాలను తెలపడం ఇప్పటి వరకు ఉచితంగా ఉండగా.. ఇక నుంచి ప్రశ్నకు రూ.500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. సోమవారం నిర్వహించిన సమావేశంలో ఉన్నత విద్యామండలి ఈ నిర్ణయం తీసుకుంది. ఉచితం కావడంతో అభ్యంతరాలు వందల సంఖ్యలో వస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య బాలకిష్టారెడ్డి తెలిపారు. సరైన అభ్యంతరం వ్యక్తం చేసిన వారికి రుసుము తిరిగి చెల్లిస్తామని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

KTR: రాష్ట్రంలో ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. వేటు తప్పదా..


Gun Firing Case: రూ.333 కోట్లు.. వంద మంది యువతులే టార్గెట్.. వెలుగులోకి ప్రభాకర్ నేరాలు

Supreme Court: తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీంకు కేటీఆర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 04 , 2025 | 04:58 AM