Share News

Beerla ilaiaha: తెలంగాణ వీరుల పేరిట అవార్డులు అభినందనీయం

ABN , Publish Date - Jul 28 , 2025 | 04:34 AM

తెలంగాణ వీరులను స్మరించుకుంటూ వారి పేరిట పురస్కారాలు ప్రదానం చేయడం అభినందనీయమని ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య అన్నారు.

Beerla ilaiaha: తెలంగాణ వీరుల పేరిట అవార్డులు అభినందనీయం

  • తెలంగాణ కళోత్సవంలో ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య

  • ఎమ్మెల్సీ అద్దంకికి జయశంకర్‌ పురస్కారం

రవీంద్రభారతి, జూలై 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ వీరులను స్మరించుకుంటూ వారి పేరిట పురస్కారాలు ప్రదానం చేయడం అభినందనీయమని ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో తెలంగాణ కల్చరల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో తెలంగాణ కళోత్సవం జరిపారు. ఇందులో భాగంగా తెలంగాణ సన్మాన్‌ పురస్కార ప్రదానోత్సవం నిర్వహించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌కు ప్రొఫెసర్‌ జయశంకర్‌ పురస్కారం, బీసీ కమిషన్‌ సభ్యురాలు రంగు బాలలక్ష్మికి వీరనారి చాకలి ఐలమ్మ, దరువు అంజన్నకు గద్దర్‌, కాసుల ప్రతాపరెడ్డికి సురవరం ప్రతాపరెడ్డి, పొన్నం రవిచంద్రకు పైడి జయరాజ్‌ పురస్కారాలు ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విప్‌ బీర్ల ఐలయ్య పురస్కార గ్రహీతల్ని సత్కరించి అభినందించారు. తెలంగాణ వైతాళికులు చేసిన త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరముందన్న ఆయన.. పురస్కారాలు అందుకున్న వారంతా తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుగ్గా పనిచేశారని చెప్పారు. కార్యక్రమంలో గురుకుల విద్యాలయాల సంస్థ సంయుక్త కార్యదర్శి శ్యామ్‌ప్రసాద్‌, నారగోని పురుషోత్తం గౌడ్‌, కాలేరు సురేశ్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

గాజాపై దాడులకు విరామం.. ఇజ్రాయెల్ కీలక నిర్ణయం

కంబోడియా, థాయ్‌లాండ్ తక్షణం చర్చలు చేపట్టేందుకు రెడీ.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 28 , 2025 | 04:34 AM