Health: వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు
ABN , Publish Date - Apr 26 , 2025 | 04:17 AM
రాష్ట్రంలోని 34 బోధనాస్పత్రుల్లో వృద్ధులకు వైద్య సేవలందించేందుకు ప్రత్యేకంగా జెరియాట్రిక్ విభాగం ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది.
34 బోధనాస్పత్రుల్లో 20పడకలతో జెరియాట్రిక్ విభాగం
హైదరాబాద్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 34 బోధనాస్పత్రుల్లో వృద్ధులకు వైద్య సేవలందించేందుకు ప్రత్యేకంగా జెరియాట్రిక్ విభాగం ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. డార్క్ బ్లూ, బ్లూ రంగుల్లో ప్రత్యేకంగా కనిపించే ఈ విభాగం సేవలు వచ్చేనెల రెండోవారంలో ప్రారంభించడానికి వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి ఆస్పత్రిలోనూ వారి కోసం 20 పడకలతో ఏర్పాటు చేసే ప్రత్యేకంగా కనిపించేలా చర్యలు తీసుకుంటోంది. ఓపీ విభాగంలో జనరల్ మెడిసిన్ వైద్యులతోపాటు రోగుల సమస్యను బట్టి స్పెషలిస్టుల వైద్య సేవలందుతాయి.
ముదిమి వయస్సులో ఉండటం వల్ల కీళ్లనొప్పులతో నడవలేని పరిస్థితితో సతమతమయ్యే వారికి ఫిజియోథెరపీ సేవలుంటాయి. గాంఽధీ బోధన ఆసత్రిరలో ప్రస్తుతం నాలుగు జెరియాట్రిక్ ఎండీ సీట్లు ఉండటంతో ఇప్పటికే అక్కడ ఆ విభాగం విడిగా ఏర్పాటైంది. ఇందులో ప్రధానంగా మెంటల్, మొబిలిటీ, ఐ కేర్, డెంటల్ సమస్యలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని రాష్ట్ర వైద్య విద్యా సంచాలకుడు నరేంద్ర కుమార్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీటీ స్కాన్‌లో బయటపడ్డ షాకింగ్ విషయం..
వృద్ధిరేటులో ఏపీ రాష్ట్రానికి రెండో స్థానం
For More AP News and Telugu News