Share News

State Election Commission: వచ్చే నెల 2న పంచాయతీల తుది ఓటరు జాబితా

ABN , Publish Date - Aug 27 , 2025 | 05:22 AM

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సిద్ధమవుతోంది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో..

State Election Commission: వచ్చే నెల 2న పంచాయతీల తుది ఓటరు జాబితా

  • స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న ఎస్‌ఈసీ

  • ఓటరు జాబితా రూపకల్పనకు నోటిఫికేషన్‌

  • 28న ముసాయిదా.. 30వరకు అభ్యంతరాల స్వీకరణ

  • తొలుత సర్పంచ్‌ ఎన్నికలు జరిపే అవకాశం?

హైదరాబాద్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సిద్ధమవుతోంది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. పంచాయతీల పరిధిలో ఓటరు జాబితా సవరణ, తుది ఓటరు జాబితా వెల్లడికి సంబంధించి మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. గ్రామపంచాయతీల పరిధిలో తుది ఓటరు జాబితా సిద్ధం చేసేందుకు, పోలింగ్‌ కేద్రాల ఎంపిక, వాటి నిర్వహణకు తేదీలను నిర్ణయిస్తూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాణి కుముదిని నోటిఫికేషన్‌ విడుదల చేశారు. నోటిఫై చేసిన అన్ని గ్రామపంచాయతీల్లో ఫొటో ఓటర్ల జాబితాను తయారు చేసి ప్రచురించాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఈ ఆదేశాల ప్రకారం.. ఈ నెల 28న గ్రామపంచాయతీ, మండల పరిషత్‌ కార్యాలయాల్లో ముసాయిదా ఓటరు జాబితాను, పోలింగ్‌ కేంద్రాల సమాచారాన్ని ప్రదర్శించాలి. 29న జిల్లా ఎన్నికల అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలి. 30న మండల స్థాయిలో ఎంపీడీవోలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కావాలి. 28 నుంచి 30 వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించి.. 31న వాటిని పంచాయతీలు, వార్డుల వారీగా గ్రామాల్లో ప్రదర్శించాలి. అనంతరం సవరించిన తుది ఓటరు జాబితాను సెప్టెంబరు 2న విడుదల చేయాలని అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.


తొలుత సర్పంచ్‌ ఎన్నికలు..?

స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబరు 30లోపు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడంతో ప్రభుత్వం కూడా ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని చూస్తోంది. అయితే గ్రామపంచాయతీ పరిధిలో ఓటరు జాబితాను సిద్ధం చేసేందుకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ జారీ చేయడంతో.. తొలుత సర్పంచ్‌ ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదీ సెప్టెంబరులోనే జరుగుతాయని భావిస్తున్నారు. అయితే ఎన్నికల ప్రక్రియ ఎలా ఉంటుందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఎన్ని విడతల్లో ఎన్నికలు నిర్వహించాలన్నది ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి ఉంటుందని ఎస్‌ఈసీ అధికారి ఒకరు చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

లిక్కర్ స్కామ్‌లో నిందితులకు మళ్లీ రిమాండ్ పొడిగింపు

ఈ రాశుల వారు.. ఈ మంత్రాలు చదివితే దశ..

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 27 , 2025 | 05:22 AM