Share News

Uttam Kumar Reddy: అలుగు దుంకుతున్న చెరువులు

ABN , Publish Date - Aug 24 , 2025 | 04:16 AM

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలో చెరువులు నిండు కుండల్లా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా 34,740 చెరువులకు 12,701 చెరువులు అలుగులు పారుతున్నాయి. 10,240 చెరువు లు..

Uttam Kumar Reddy: అలుగు దుంకుతున్న చెరువులు

  • నిండు కుండల్లా 12,701 జలాశయాలు

హైదరాబాద్‌, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలో చెరువులు నిండు కుండల్లా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా 34,740 చెరువులకు 12,701 చెరువులు అలుగులు పారుతున్నాయి. 10,240 చెరువు లు 75 శాతానికి పైగా నిండగా.. 5,681 చెరువులు 50-75 శాతం.. 3,302 చెరువులు 25-50ు నిండాయి. ఆదిలాబాద్‌లో 977 చెరువులకు 556 చెరువులు అలుగు దుంకుతున్నాయి. 399 చెరువులు 75 శాతానికి పైగా నిండా యి. ములుగులో 2,142 చెరువులకు 1,529 చెరువులు పూర్తిగా నిండాయి. 473 చెరువుల్లో 75 శాతానికి పైగా నీరుంది. నల్లగొండలో 1,628 చెరువులకు 613 చెరువుల్లో 25ు లోపు నీరు ఉంది. 25-50ు లోపు నిల్వ కల చెరువులు 234, 50-75ు లోపు 281 చెరువులు, 75-100ు లోపు 317 చెరువుల్లో నీటి నిల్వలున్నాయి. 183 చెరువులు అలుగు పారుతున్నాయి. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట పరిధిలో 1,225 చెరువులకు 8 మాత్రమే 25ు లోపు నిల్వలు కలిగి ఉన్నాయి. 16 చెరువుల్లో 25-50 శాతం మధ్య, 110 చెరువుల్లో 50-75 శాతం లోపు, 449 చెరువుల్లో 75-100 శాతం లోపు నీరు ఉంది. 642 చెరువులు అలుగులు పారుతున్నాయి.


ఇవి కూడా చదవండి..

నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు

అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్

For More National News And Telugu News

Updated Date - Aug 24 , 2025 | 04:16 AM