Telangana Municipalities: మున్సిపాలిటీలకు భారీగా నిధులు విడుదల
ABN , Publish Date - Oct 25 , 2025 | 09:00 AM
తెలంగాణలోని మున్సిపాలిటీలకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. రూ.2,780 కోట్లను రేవంత్ సర్కార్ విడుదల చేసింది.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 25: తెలంగాణలోని మున్సిపాలిటీలకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. రూ.2,780 కోట్లను రేవంత్ సర్కార్ విడుదల చేసింది. 138 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 2432 పనులకు ఆమోదం తెలిపింది. వెంటనే టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కొత్త మున్సిపాలిటీలు, కొత్త గ్రామాలు విలీనమైన మున్సిపాలిటీల్లో పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలోని 138 మున్సిపాలిటీలకు రూ. 2,780 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
తెలంగాణ కోర్ అర్బన్ సిటీని మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు వెంటనే నిధులు విడుదల అయ్యాయి. తెలంగాణ రైజింగ్ విజన్ 2027లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రమంతటా ఉన్న పట్టణాలను గ్రోత్ హబ్‌లుగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
TG News: మద్యం దుకాణాలకు ముగిసిన దరఖాస్తుల ప్రక్రియ
HAM Roads: నోటిఫికేషన్ విడుదల.. 11వేల 540 కోట్లతో హామ్ రోడ్ల నిర్మాణం