HAM Roads: నోటిఫికేషన్ విడుదల.. 11వేల 540 కోట్లతో హామ్ రోడ్ల నిర్మాణం
ABN , Publish Date - Oct 25 , 2025 | 08:42 AM
తెలంగాణలో హామ్ రోడ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 11వేల 540 కోట్లతో హ్యామ్ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 25: తెలంగాణలో హామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) రోడ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 11వేల 540 కోట్లతో హ్యామ్ రోడ్ల నిర్మాణం చేపట్టనుంది. ఆర్ అండ్ బి శాఖ మొత్తం 32 ప్యాకేజీల్లో 400 రోడ్లు నిర్మాణం చేయనుంది. ఇందుకు సంబంధించి రోడ్డు అభివృద్ధి పనులు 2026లో ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కొత్త రోడ్లు, దెబ్బతిన్న రహదారులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం హామ్ విధానంలో రోడ్లను నిర్మిస్తోంది.
త్వరలోనే హామ్ పనులు కార్యరూపం దాల్చనున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిర్మించనున్న రోడ్ల కోసం మొత్తం రూ. 11 వేల కోట్లను ప్రభుత్వం విడుదల చేసినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో ముఖ్యంగా చిన్న కాంట్రాక్టర్లకు కూడా అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. దాదాపు 400 రోడ్ల నిర్మాణ పనులను మొత్తం 32 ప్యాకేజీల ద్వారా చేపట్టనున్నట్లు వెల్లడించారు..ఈ టెండర్లలో చిన్న కాంట్రాక్టర్లు కూడా పాల్గొనేందుకు అర్హులని మంత్రి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
Bus Accident: మరో ప్రమాదం.. లారీని ఢీ కొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
RS Praveen Kumar: రౌడీలకు, మహిళలకు మధ్య పోరాటం జరుగుతోంది..