Bus Accident: మరో ప్రమాదం.. లారీని ఢీ కొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
ABN , Publish Date - Oct 25 , 2025 | 09:23 AM
కర్నూలు బస్సు ప్రమాద ఘటన మరువకముందే కర్నూలులోనే మరో బస్సు ప్రమాదం జరిగింది. ఈరోజు బెంగళూరు నుండి హైదరాబాద్ కు వస్తుండగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది.
హైదరాబాద్, అక్టోబర్ 25: కర్నూలు బస్సు ప్రమాద ఘటన మరువక ముందే కర్నూలులోనే మరో బస్సు ప్రమాదం జరిగింది. ఈరోజు బెంగళూరు నుండి హైదరాబాద్ కు వస్తుండగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న బస్సు ప్రమాదం ఘటన మరువక ముందే మరో ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. తెల్లవారుజామున 4 గంటల సమయంలో కర్నూలు వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులందరూ గాడలో నిద్రలో ఉన్నారు. భారీ వర్షం కారణంగా ముందున్న వాహనాన్ని తప్పించబోయి లారీని బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం మొత్తం పూర్తిగా ధ్వంసం అయింది. తెల్లవారుజామున కావడంతో బస్సు ముందు అద్దాలు తో పాటు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది.
డ్రైవర్ ప్రమాద సమయంలో చాక చక్యంగా వ్యవహరించడంతోనే ప్రమాద తీవ్రత తగ్గిందని ప్రయాణికులు చెబుతున్నారు. అయితే ప్రమాద సమయంలో తమకు ఎలాంటి గాయాలు కాలేదని ఓ ప్రయాణికుడు తెలిపారు. బస్సు ప్రమాదం జరిగిన అనంతరం నిబంధనలకు విరుద్ధంగా కర్నూల్ నుండి హైదరాబాద్ వరకు బస్సును తీసుకురావడంతో ఆర్టిఏ అధికారులు కేసు నమోదు చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను ఆరంగర్ చౌరస్తా వద్ద దింపి బస్సును బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయానికి తరలించారు.
ఇవి కూడా చదవండి:
Telangana Municipalities: మున్సిపాలిటీలకు భారీగా నిధులు విడుదల
TG News: మద్యం దుకాణాలకు ముగిసిన దరఖాస్తుల ప్రక్రియ