TG News: మద్యం దుకాణాలకు ముగిసిన దరఖాస్తుల ప్రక్రియ
ABN , Publish Date - Oct 25 , 2025 | 08:45 AM
మద్యం షాపుల లైసెన్సుల కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు గురువారంతో ముగిసిందని బాలానగర్ ఎక్సైజ్ ఇన్‌చార్జి సీఐ యాదయ్య ఒక ప్రకటనలో తెలిపారు. బాలానగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 42 మద్యం దుకాణాలు ఉండగా లైసెన్సుల కోసం 2,428 మంది, కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 47 మద్యం దుకాణాలకు 2,713 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు.
- 27న లక్కీడ్రా ద్వారా షాపుల కేటాయింపు
హైదరాబాద్: మద్యం షాపుల లైసెన్సుల కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు గురువారంతో ముగిసిందని బాలానగర్ ఎక్సైజ్ ఇన్‌చార్జి సీఐ యాదయ్య ఒక ప్రకటనలో తెలిపారు. బాలానగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 42 మద్యం దుకాణాలు ఉండగా లైసెన్సుల కోసం 2,428 మంది, కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 47 మద్యం దుకాణాలకు 2,713 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. మేడ్చల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న 29 మద్యం దుకాణాల కోసం 922 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన వివరించారు.

ఈ నెల 27న ఉప్పల్ ఫిర్యాదిగూడలోని ఇందిరానగర్ కాలనీ సాయినగర్‌లో ఉన్న శ్రీ పలానీ కన్వెన్షన్‌లో మేడ్చల్ కలెక్టర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్‌కే ఫయాజొద్దీన్, ఎక్సైజ్ ఉన్నతాధికారుల సమక్షంలో లక్కీడ్రా తీసి షాపులను అప్పగించనున్నట్లు ఆయన తెలిపారు. వైన్ షాపులను దక్కించుకున్న అభ్యర్థుల లెసెన్సు డిసెంబరు 1, 2025 నుంచి 30-11-2027 వరకు ఉంటుందని ఆయన వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్.. బంగారం ధర మరికొంచెం తగ్గింది..
Read Latest Telangana News and National News