Share News

RS Praveen Kumar: రౌడీలకు, మహిళలకు మధ్య పోరాటం జరుగుతోంది..

ABN , Publish Date - Oct 25 , 2025 | 08:23 AM

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక రౌడీలకు, మహిళలకు మధ్య జరుగుతున్న పోరాటమని, ఇందులో మహిళనే గెలవాలని బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం ఆయన బోరబండ బలహీన వర్గాల కాలనీలో ఇంటింటి ప్రచారం చేశారు.

RS Praveen Kumar: రౌడీలకు, మహిళలకు మధ్య పోరాటం జరుగుతోంది..

- ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక(Jubilee Hills by-election) రౌడీలకు, మహిళలకు మధ్య జరుగుతున్న పోరాటమని, ఇందులో మహిళనే గెలవాలని బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌(RS Praveen Kumar) అన్నారు. శుక్రవారం ఆయన బోరబండ బలహీన వర్గాల కాలనీలో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు, రౌడీలు కలిసి జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ గెలుపు కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు.


city3.2.jpg

కాంగ్రెస్‌ మంత్రులు లిక్కర్‌ సీసాల మూతమీద అతికించే స్టిక్కర్లను కూడా వదలకుండా కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రౌడీ రాజ్యం రావద్దంటే, రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి బుద్థి చెప్పాలంటే, హైడ్రా మన ఇళ్లను కూల్చవద్దంటే కారు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ బోరబండ డివిజన్‌ అధ్యక్షుడు టి.కృష్ణమోహన్‌, నాయకులు ఎస్‌ విజయకుమార్‌, వసంతరావు, జేఎల్‌ మేరి, ధర్మ పాల్గొన్నారు.


బీఆర్‌ఎస్ లో భారీ చేరికలు

బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ యూత్‌ కరేజ్‌(హెచ్‌వైసీ) వ్యవస్థాపకుడు సల్మాన్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో షేక్‌పేట డివిజన్‌కు చెందిన ముస్లింలు, మహిళలు అధిక సంఖ్యలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్సీ డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ కుమార్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వ పతనం మొదలైంది అనడానికి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరికలే నిదర్శమని పేర్కొన్నారు.


ఆదర్శంగా తీర్చిదిద్దిన మాగంటి గోపీనాథ్‌

మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉండి జూబ్లీహిల్స్‌ నియోజకవర్గాన్ని దివంగత నేత మాగంటి గోపీనాథ్‌ ఆదర్శవంతంగా తీర్చిదిద్దారని, ఆయన చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేసి తనను గెలిపించాలని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీత ఓటర్లను అభ్యర్థించారు. శుక్రవారం ఎర్రగడ్డ డివిజన్‌ ఛత్రపతి శివాజీనగర్‌, ఆనంద్‌నగర్‌ కాలనీ, సుల్తాన్‌నగర్‌ తదితర బస్తీల్లో ఆమె ప్రచారం చేశారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పాలనలోనే ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ గజ్వేల్‌ ఇన్‌చార్జి వంటేరు ప్రతాపరెడ్డి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ సతీమణి ఆయేషా, మెట్టుగూడ కార్పొరేటర్‌ సునీత, బీఆర్‌ఎస్‌ ఎర్రగడ్డ డివిజన్‌ అధ్యక్షుడు సంజీవ, నాయకులు మహ్మద్‌ షరీఫ్‌ ఖురేషి, చంద్రశేఖర్‌, షేక్‌ జావెద్‌, సయ్యద్‌ రసూల్‌, జయంత్‌ పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్ న్యూస్.. బంగారం ధర మరికొంచెం తగ్గింది..

కన్నీటి మంట ఊరట చెమ్మ!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 25 , 2025 | 08:23 AM