Suryapet : సీతారామపురంలో ఉద్రిక్తత.. ఎన్నికల అధికారిని గదిలో బంధించిన గ్రామస్థులు
ABN , Publish Date - Dec 15 , 2025 | 06:00 PM
తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల హడావుడి నడుస్తుంది. ఇప్పటి వరకు గెలిచిన కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు ముందంజలో ఉంటే.. బీఆర్ఎస్ అభ్యర్థులు రెండోస్థానంలో ఉన్నారు. సూర్యాపేట జిల్లా సీతారామపురంలో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర (Telangana) వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) హడవుడి నడుస్తుంది. సూర్యాపేట జిల్లా ( Suryapet District) చిలుకూరు మండలం.. సీతారామపురం గ్రామంలో ఎన్నికల అధికారి (RO) నాగరాజు (Nagaraju)ను గ్రామస్థులు ఓ గదిలో బంధించారు. ఎన్నికల అధికారి ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని.. ఉపసర్పంచ్ (Deputy Sarpanch) పదవిని ముందుగానే ప్రకటించారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. నాగరాజు వ్యవహారంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన్ని గదిలో బంధించారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత (Extreme Tension) చోటు చేసుకుంది. ఈ ఘటనపై అధికారులు, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయం తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు సంబరాలు చేసుకుంటే.. ఓడిన అభ్యర్థులు కొన్నిచోట్ల ఆందోళన చేస్తున్నారు. తమ వద్ద డబ్బు తీసుకొని వేరే వాళ్లను గెలిపించారని ఆరోపిస్తూ.. తిరిగి డబ్బు చెల్లించాల్సిందిగా ఓటర్లను ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గెలిచిన అభ్యర్థులపై ఓడిన అభ్యర్థులు దాడులకు పాల్పడుతున్నారు. వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఓడిన అభ్యర్థిపై గెలిచిన అభ్యర్థి బంధువులు దాడికి పాల్పడ్డారు.
కామారెడ్డి జిల్లా (Kamareddy) సోమార్‌పేటలో ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి బాలరాజును గెలిచిన సర్పంచ్ (Sarpanch) తమ్ముడు ట్రాక్టర్ తో ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సర్పంచ్ గా గెలిచిన పాపయ్య తమ్ముడు చిరంజీవికి, ఓడిన బాలరాజు వర్గంతో గొడవలు జరిగాయి. ఆది మనసులో పెట్టుకొని ట్రాక్టర్ తో ఢీకొట్టి ప్రత్యర్థులపై తన కక్ష తీర్చుకున్నాడు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీ బైక్ ర్యాలీ.. రెండు వర్గాల మధ్య ఘర్షణ..
సచివాలయ ఉద్యోగులపై పని భారం తగ్గించండి: సీఎంకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి లేఖ