Share News

Ponnam: హైదరాబాద్‌లో ఐడీటీఆర్‌ ఏర్పాటు చేయండి

ABN , Publish Date - May 06 , 2025 | 05:06 AM

తెలంగాణలో రవాణా రంగ అభివృద్ధికి కేంద్ర సర్కారు సహకారం అందించాలని కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ లేఖ రాశారు.

Ponnam: హైదరాబాద్‌లో ఐడీటీఆర్‌ ఏర్పాటు చేయండి

  • ఐఐటీఎంఎస్‌ ఏర్పాటుకు రూ.55 కోట్లు ఇవ్వండి

  • ఎస్‌ఏఎస్‌సీఐకి రూ.176.5 కోట్లు విడుదల చేయండి

  • కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి మంత్రి పొన్నం లేఖ

హైదరాబాద్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో రవాణా రంగ అభివృద్ధికి కేంద్ర సర్కారు సహకారం అందించాలని కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ లేఖ రాశారు. ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్‌ ఇంటెలిజెంట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(ఐఐటీఎంఎస్‌), డ్రైవింగ్‌ ట్రైనింగ్‌ సంస్థల ఏర్పాటు, డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌ల ఆటోమేషన్‌, ఎలక్ట్రిక్‌ వాహన ప్రోత్సాహం వంటి రంగాల్లో ఆర్థిక సహాయం అందించాలని కోరారు. హైదరాబాద్‌ పరిసరాల్లో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డ్రైవింగ్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌(ఐడీటీఆర్‌) కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం సిరిసిల్లలో ఉన్న ఐడీటీఆర్‌ నగరానికి దూరంగా ఉండటం ఇబ్బందిగా మారిందని అన్నారు.


మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో 40 ఎకరాల భూమి ఉందని, అక్కడ కొత్త ఐడీటీఆర్‌ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనలను గుర్తించి తక్షణమే ఈ-చలాన్లు జారీ చేసే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఇంటిగ్రేటెడ్‌ ఇంటెలిజెంట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను(ఐఐటీఎంఎస్‌) తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించిందని, దీని కోసం కేంద్రం రూ.55 కోట్లు సాయం అందించాలన్నారు. వాహన స్ర్కాపింగ్‌ విధానం మరియు ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్ల అమలులో భాగంగా కేంద్రం మంజూరు చేసిన రూ.176.5 కోట్లు ఇంకా విడుదల చేయలేదని, వాటిని 2025-26 ఆర్థిక సంవత్సరంలో తప్పనిసరిగా విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న 57 డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌లను ఆటోమేట్‌ చేయడానికి రూ.43.45 కోట్ల ఖర్చు అవుతుందని, డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీ ప్రక్రియను పారదర్శకంగా మార్చే ఈ ప్రయత్నానికి కేంద్రం నిధులు ఇవ్వాలని గడ్కరీని మంత్రి పొన్నం ప్రభాకర్‌ కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Pahalgam Terror Attack: ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ.. ఎందుకంటే..

WAQF Amendment Bill 2025: వక్ఫ్ సవరణ బిల్లుపై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

TGSRTC: బస్ భవన్‌‌ను ముట్టడించిన కార్మికులు.. పరిస్థితి ఉద్రిక్తం

For Telangna News And Telugu News

Updated Date - May 06 , 2025 | 05:06 AM