Inter Exams 2026: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ 2026 విడుదల
ABN , Publish Date - Oct 31 , 2025 | 05:35 PM
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ 2026 విడుదల అయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఈ పరీక్షలు జరగనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది.
హైదరాబాద్, అక్టోబర్ 31: తెలంగాణలో 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఈ పరీక్షలు జరగనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమై ఫిబ్రవరి 21వ తేదీ నాటికి పూర్తవుతాయని పేర్కొంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఇప్పటివరకు కేవలం సెకండ్ ఇయర్ విద్యార్థులకు మాత్రమే ప్రాక్టికల్ పరీక్షలు జరిగేవి. ఈసారి వీరితో పాటు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకూ ల్యాబ్ ప్రాక్టికల్స్ నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. ఈ నిర్ణయంతో జనవరి 21వ తేదీన ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష, జనవరి 23వ తేదీన ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్, జనవరి 24వ తేదీన ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహించనున్నారు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ షెడ్యూల్ 2026
25- 02 -2026 : పార్ట్ 1 (సెకండ్ లాంగ్వేజ్ -1)
27- 02 -2026 : పార్ట్ 2 - ఇంగ్లీష్ పేపర్ -1
02- 03 -2026 : మ్యాథ్స్ 1ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్
5- 03 -2026 : మ్యాథ్య్ పేపర్ 1బీ, జువాలజీ, హిస్టరీ -1
9- 03 -2026 : ఫిజిక్స్, ఎకనామిక్స్ -1
12- 03 -2026 : కెమిస్ట్రీ, కామర్స్
17- 03 -2026 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫ్రీ - 1
ఇంటర్ సెకండ్ ఇయర్ షెడ్యూల్ 2026:
26- 02 -2026 : పార్ట్ 2 (సెకండ్ లాంగ్వేజ్ -2)
28- 02 -2026 : పార్ట్ 1 - ఇంగ్లీష్ పేపర్ -2
03- 03 -2026 : మ్యాథ్స్ 2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ -2
6- 03 -2026 : మ్యాథ్య్ పేపర్ 2బీ, జువాలజీ, హిస్టరీ -2
10- 03 -2026 : ఫిజిక్స్, ఎకనామిక్స్-2
13- 03 -2026 : కెమిస్ట్రీ, కామర్స్ -2
16-03-2026: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ 2,
18- 03 -2026 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫ్రీ - 1
ఇవి కూడా చదవండి:
Maheshwar Reddy: తెలంగాణలో దుర్మార్గమైన పాలన.. మహేశ్వర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
KTR: రెండేళ్లలోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించింది: కేటీఆర్