Damodara Rajanarsimha: టీవీవీపీలో 1,690 పోస్టుల భర్తీ:దామోదర
ABN , Publish Date - Aug 09 , 2025 | 04:06 AM
తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ)లో 1,690 డాక్టర్ పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సానుకూలంగా స్పందించారు
హైదరాబాద్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ)లో 1,690 డాక్టర్ పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సానుకూలంగా స్పందించారు. శుక్రవారం సంగారెడ్డిలోని ఆయన నివాసంలో డాక్టర్ల సంఘాలతో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీవీవీపీని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా త్వరలో అప్‌గ్రేడ్ చేస్తామన్నారు.
అందుకనుగుణంగా డాక్టర్ల పోస్టుల భర్తీకి తెలంగాణ మెడికల్ బోర్డు త్వరగా విధివిధానాలను రూపొందించాలని ఆదేశించారు. టీవీవీపీలో క్యాడర్ స్ర్టెంత్ పెంపుపై కమిషనర్ డా.అజయ్ కుమార్‌తో మంత్రి చర్చించారు. అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించినందుకు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని చేసిన విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అవి చూసి షాక్ అయ్యా: బండి సంజయ్
‘బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు’
For More AndhraPradesh News And Telugu News