Share News

Telangana Government: భాషా సాంస్కృతిక వికాసానికి ప్రోత్సాహం

ABN , Publish Date - Aug 24 , 2025 | 03:18 AM

తెలంగాణ భాషావ్యాప్తికి, సాంస్కృతిక వికాసానికి సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో..

Telangana Government: భాషా సాంస్కృతిక వికాసానికి ప్రోత్సాహం

  • వివిధ సంస్థలకు రూ.45 లక్షలు మంజూరు: జూపల్లి

హైదరాబాద్‌, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ భాషావ్యాప్తికి, సాంస్కృతిక వికాసానికి సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణలో దశాబ్దాల కాలం నుంచి భాషా, సాహిత్య సాంస్కృతిక, కళల పరిరక్షణకు కృషి చేస్తున్న సంస్థల సేవలను మరింత ప్రోత్సహించేందుకు ఆయా సంస్థలకు రాష్ట్రప్రభుత్వం చేయూతను అందించాలని నిర్ణయించిందని తెలిపారు. ఈ క్రమంలోనే తెలంగాణ సారస్వత పరిషత్‌కు రూ.20లక్షలు, సుల్తాన్‌బజార్‌లోని శ్రీకృష్ణదేవరాయ భాషానిలయానికి రూ.10 లక్షలు, చిక్కడపల్లిలోని త్యాగరాయగాన సభకు రూ.10 లక్షలు, వరంగల్‌లోని పోతన విజ్ఞాన పీఠానికి రూ.5 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ఆయన తెలిపారు.


ఇవి కూడా చదవండి..

నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు

అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్

For More National News And Telugu News

Updated Date - Aug 24 , 2025 | 03:18 AM