Telangana: ‘ఉప సర్పంచ్‌ల చెక్ పవర్ రద్దు చేయలేదు’
ABN , Publish Date - Dec 23 , 2025 | 06:45 PM
ఉప సర్పంచ్‌లకు ఉన్న చెక్ పవర్‌ను రద్దు చేస్తున్న వార్తలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఈ వార్తల్లో మాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. కాసేపటిక్రితం.. రాష్ట్ర ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్‌ను
హైదరాబాద్, డిసెంబర్ 23: ఉప సర్పంచ్‌లకు ఉన్న చెక్ పవర్‌ను రద్దు చేస్తున్న వార్తలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఈ వార్తల్లో మాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. కాసేపటిక్రితం.. రాష్ట్ర ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్‌ను రద్దు చేసినట్లు, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఒక సర్క్యూలర్ కూడా బాగా వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించిన తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ.. ఉప సర్పంచ్‌ల చెక్ పవర్ రద్దు అంశంపై స్పందించింది. ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఈ అంశంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని క్లారిటీ ఇచ్చింది.
Also Read:
కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన ఢిల్లీ క్యాపిటల్స్
మధ్యప్రదేశ్ ఎస్ఐఆర్‌లో 42 లక్షల ఓట్ల తొలగింపు
అర్థరాత్రి వరకు మద్యం అమ్మకాలు..