Share News

New Year Celebrations: అర్థరాత్రి వరకు మద్యం అమ్మకాలు..

ABN , Publish Date - Dec 23 , 2025 | 06:12 PM

న్యూఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ కీలక ప్రకటన చేసింది. మద్యం అమ్మకాలపై ప్రత్యేక జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం డిసెంబర్ 31వ తేదీన అర్థరాత్రి వరకు మద్యం విక్రయాలు కొనసాగనున్నాయి.

New Year Celebrations: అర్థరాత్రి వరకు మద్యం అమ్మకాలు..
New Year celebrations Telangana

హైదరాబాద్, డిసెంబర్ 23: న్యూఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ కీలక ప్రకటన చేసింది. మద్యం అమ్మకాలపై ప్రత్యేక జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం డిసెంబర్ 31వ తేదీన అర్థరాత్రి వరకు మద్యం విక్రయాలు కొనసాగనున్నాయి. బార్లకు, క్లబ్‌లకు, ఈవెంట్ పర్మిషన్ తీసుకున్న వారికి, టూరిజం ప్రాంతాల్లో రాత్రి 1 గంట వరకు మద్యం సేవించడానికి అనుమతినిచ్చారు. అలాగే ఏ4 షాపుల్లో (వైన్స్ షాపులు) రాత్రి 1 గంటల వరకు మద్యం అమ్మకాలకు అవకాశం ఇచ్చారు. ఈ మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ సి హరికిరణ్ పేరిట ఉత్తర్వులు జారీ చేశారు.


Also Read:

Human turns into lizard: పగలు మనుషులు.. రాత్రి అయితే బల్లులు.. ఈ వింత కుటుంబం గురించి తెలిస్తే..

Daily laughter Benefits: ప్రతిరోజూ బిగ్గరగా నవ్వడం వల్ల దీర్ఘాయువు పెరుగుతుందా?

Updated Date - Dec 23 , 2025 | 06:12 PM