CM Revanth: ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్.. ఏఐసీసీ కీలక నేతలతో భేటీ
ABN , Publish Date - Oct 25 , 2025 | 01:13 PM
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ నూతన కార్యాలయం ఇందిరా భవన్‌లో ఏఐసీసీ కీలక నేతలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 25: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ నూతన కార్యాలయం ఇందిరా భవన్‌లో ఏఐసీసీ కీలక నేతలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొననున్నారు. భేటీలో డీసీసీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనున్నారు.
ఇప్పటికే జిల్లాల వ్యాప్తంగా పర్యటించిన ఏఐసీసీ పరిశీలకులు.. కార్యకర్తల అభిప్రాయాలు తీసుకొని నివేదిక సిద్ధం చేశారు. ఒక్కో జిల్లా నుంచి వివిధ సామాజికవర్గాల నుంచి ముగ్గురు పేర్లతో నివేదికను ఏఐసీసీకి అందజేశారు. పరిశీలకులు అందజేసిన నివేదికపై ఇవాళ కీలక చర్చ జరుగనుంది. నవంబర్ మొదటి వారంలో డీసీసీల జాబితాను కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేయనుంది
ఇవి కూడా చదవండి:
Telangana Inter Exams: తెలంగాణలో ఇంటర్ పరీక్షల తేదీ ఖరారు
High Court on Liquor Tenders: మద్యం టెండర్లపై హైకోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్