Telangana Inter Exams: తెలంగాణలో ఇంటర్ పరీక్షల తేదీ ఖరారు
ABN , Publish Date - Oct 25 , 2025 | 11:46 AM
తెలంగాణలో ఇంటర్ పరీక్షల తేదీ ఖరారు అయ్యాయి. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 25: తెలంగాణలో ఇంటర్-2025 పరీక్షల తేదీ ఖరారు అయ్యాయి. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరుగనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ సిలబస్‌లోనూ మార్పులు చేసింది. ఈ నిర్ణయంతో ఫస్ట్ ఇయర్లో కూడా ల్యాబ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉండనున్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలతో పాటు ప్రాక్టికల్స్, పరీక్షల్లో చేస్తున్న మార్పులపై ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు పలు వివరాలను వెల్లడించారు. ఈ విద్యాసంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9 లక్షల 50 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన తరుణంలో ఇవాళ (శనివారం) ఇంటర్ బోర్డు మీడియా సమావేశం నిర్వహించింది.
ఫిబ్రవరిలో జరిగే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను ప్రభుత్వ కళాశాలల్లోనే నిర్వహించేలా బోర్డు చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వ సెక్టార్ కాలేజీలను ప్రాక్టికల్ సెంటర్లను మినహాయించాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగానే ప్రాక్టికల్స్ షెడ్యూల్‌ను సిద్ధం చేసింది. పిల్లల్లో పరీక్షల భయాన్నిపొగొట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతియేటా ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు సుమారు 4.20 లక్షలకు పైగా విద్యార్థులు హాజరవుతున్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
Kavitha Speech at Gun Park: క్షమించండి.. కవిత భావోద్వేగం
Sadashivpet News: తప్పిన పెను ప్రమాదం.. స్కూల్ బస్సుపై తెగిపడిన విద్యుత్ తీగ