Mahesh Kumar Goud: త్వరలో మంత్రివర్గ విస్తరణ
ABN , Publish Date - May 18 , 2025 | 04:30 AM
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఈనెలాఖరులో లేదా జూన్ మొదటి వారంలో ఉండే అవకాశం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహే్‌షకుమార్‌గౌడ్ అన్నారు. నిజామాబాద్‌లోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో శనివారం విలేకరులతో ఆయన చిట్‌చాట్ చేశారు.
ఈ నెలాఖరున లేదా జూన్ తొలివారంలో..
26 లేదా 27న పీసీసీ కార్యవర్గం ఖరారు
సోషల్ మీడియాలో అసత్య ప్రచారాల
కట్టడికి చట్టంపై కసరత్తు : మహేశ్‌గౌడ్
నిజామాబాద్, మే 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఈనెలాఖరులో లేదా జూన్ మొదటి వారంలో ఉండే అవకాశం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహే్‌షకుమార్‌గౌడ్ అన్నారు. నిజామాబాద్‌లోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో శనివారం విలేకరులతో ఆయన చిట్‌చాట్ చేశారు. రాష్ట్రంలో వివిధ సమీకరణాల వల్లే మంత్రివర్గ విస్తరణ జాప్యం అవుతోందన్నారు. రాష్ట్ర పీసీసీ కార్యవర్గం ఈనెల 26 లేదా 27న ఖరారు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. అన్ని అంశాలను పరిశీలించి పార్టీ కోసం పనిచేసిన వారికి, సామాజిక సమీకరణాలకు అనుగుణంగా అందరికీ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. సీఎం, మంత్రులు, పార్టీ సీనియర్ నేతలంతా కలిసే పని చేస్తున్నారని, ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను తీర్చడమే లక్ష్యంగా తాము ముందుకు వెళ్తున్నామని చెప్పారు. కావాలనే బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రిని మార్చాల్సిన అవసరం ఏముందని, అందరిని కలుపుకొని పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
ప్రతిపక్ష నేతలు అన్ని విషయాలను వక్రీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని, మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను కూడా వక్రీకరించారని ఆరోపించారు. ఆమె మాట్లాడిన మొత్తం విషయాలను పరిశీలించకుండా కొన్ని వ్యాఖ్యలను మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ చేశారని మండిపడ్డారు. దీనిపైన ఆమె వివరణ కూడా ఇచ్చారని చెప్పారు. అసత్య ప్రచారాలు చేసిన వారిపై సైబర్ క్రైమ్‌లో కేసులు పెడుతున్నామని తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను కట్టడి చేసేందుకు మధ్యప్రదేశ్‌లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారని, తెలంగాణలోనూ అటువంటి చట్టాన్ని తీసుకోచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. మహిళా కాంగ్రెస్ ఆందోళనలు సర్వసాధారణం అని తమ పార్టీలో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. బీఆర్‌ఎ్‌సకు రాష్ట్రంలో భవిష్యత్తు లేదని, ఆ పార్టీలో ప్రస్తుతం మూడు ముక్కలాట నడుస్తోందన్నారు. కవితకు కేసీఆర్‌కు, కవితకు కేటీఆర్‌కు, కేటీఆర్ హరీశ్‌రావుకు మధ్య పంచాయితీ నడుస్తోందని ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటేనని, ఆ రెండు పార్టీలే కలిసి పని చేస్తున్నాయని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి
Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB
PIB Fact Check: 3 రోజుల పాటు ATMలు బంద్.. వైరల్ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్..
Read Latest Telangana News And Telugu News