Telangana Local Body Elections: సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
ABN , Publish Date - Aug 30 , 2025 | 02:56 PM
స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం ఆమోదం తెలిపింది. సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఎన్నికల కమిషన్‌కు తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు లేఖ రాసింది.
హైదరాబాద్, ఆగస్టు 30: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెర దింపింది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఎన్నికల కమిషన్‌కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇవాళ భేటీ అయిన తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు చేసింది. స్థానిక ఎన్నికల రిజర్వేషన్లలో పరిమితి ఎత్తివేయాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం పేర్లను గవర్నర్‌కు క్యాబినెట్ సిఫార్సు చేసింది.
అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన ఈ మంత్రివర్గ సమావేశంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంతోపాటు, ఇటీవలి వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంపైనా చర్చించారు. పంటలు, రోడ్లు, ఇతర నష్టాలపై కేంద్ర ఆర్థికశాఖ సాయం కోరుతూ తీర్మానం చేశారు. మరోవైపు సెప్టెంబర్ 30 లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా క్యేబినెట్ నిర్ణయం తీసుకుంది.
కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై మంత్రి పొంగులేటి ప్రెస్ మీట్.. వివరాలు:
బీసీ రిజర్వేషన్లపై కేబినెట్‌లో కీలక చర్చ జరిగింది
రేపు అసెంబ్లీలో రిజర్వేషన్ బిల్లులను ఆమోదిస్తాం
భారీ వర్షాలతో కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ నష్టం
పంట, ఆస్తి, రహదారుల నష్టం అధికంగా జరిగింది
వరద నష్టాన్ని అంచనా వేయాలని అధికారులకు చెప్పాం
వర్షాల వల్ల జరిగిన నష్టం అంచనాల పై సెప్టెంబర్ 4న ఉన్నతాధికారుల సమావేశం నిర్వహిస్తాం
రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో పెట్టీ ఆమోదిస్తాం
గోశాలల పాలసీ విధి విధానాలపై చర్చించాం
2022 - 23 లో రబీ ధాన్యం సేకరణకు టెండర్లు పిలిచారు
మిల్లర్లకు ఇచ్చిన 7లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రికవరీ కాలేదు.. వారి పై పీడీ యాక్ట్ పెట్టడానికైనా ప్రభుత్వం వెనకాడదు
మత్స్య సహకార సంఘాలకు పర్సనల్ ఇంచార్జీలను నియమించాలని కేబినెట్ నిర్ణయం
నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ కు కేబినెట్ ఆమోదం
మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్:
42శాతం బీసీ రిజర్వేషన్లపై మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది
బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇస్తూ స్థానిక ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది
2018 పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్టంకు సవరణ చేయాలని నిర్ణయం
దాంతో 50శాతం సీలింగ్ ఎత్తేస్తాం
ఎక్కడా ఆటంకాలు రావనే అనుకుంటున్నాం
ఇవి కూడా చదవండి:
అంజీర్ కొనేప్పుడు జాగ్రత్త! అసలైనదా? నకిలీదా? ఇలా తెల్సుకోండి!
కల్తీ పాలను ఎలా గుర్తించాలో తెలుసా?