Share News

Hyderabad: సర్వర్‌లో సాంకేతిక సమస్యలు.. ట్యాంకర్ల బుకింగ్‌కు ఇబ్బందులు

ABN , Publish Date - Feb 08 , 2025 | 09:20 AM

హైదరాబాద్‌ మహానగర తాగునీటి, మురుగునీటి నిర్వహణలో వినియోగదారులకు సేవలందించే వాటర్‌బోర్డు వెబ్‌సైట్‌(Waterboard website) శుక్రవారం మొరాయించింది. దీంతో నీటి ట్యాంకర్‌ బుకింగ్‌కు ఇబ్బందులు తలెత్తాయి. నీటి బిల్లుల చెల్లింపులూ జరగలేదు.

Hyderabad: సర్వర్‌లో సాంకేతిక సమస్యలు.. ట్యాంకర్ల బుకింగ్‌కు ఇబ్బందులు

- గంట పాటు పని చేయని టోల్‌ ఫ్రీ నంబర్‌

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ మహానగర తాగునీటి, మురుగునీటి నిర్వహణలో వినియోగదారులకు సేవలందించే వాటర్‌బోర్డు వెబ్‌సైట్‌(Waterboard website) శుక్రవారం మొరాయించింది. దీంతో నీటి ట్యాంకర్‌ బుకింగ్‌కు ఇబ్బందులు తలెత్తాయి. నీటి బిల్లుల చెల్లింపులూ జరగలేదు. పక్షం రోజుల క్రితం వాటర్‌బోర్డు వెబ్‌సైట్‌, సర్వర్‌ హ్యాక్‌ అవడంతో ప్రైవేటు ప్రకటనలు రావడంతో పాటు సాంకేతిక సమస్యలు తలెత్తగా, తాజాగా వాటర్‌బోర్డు సర్వర్‌ మొరాయించడంతో వెబ్‌సైట్‌ పని చేయలేదు. ఈ సమస్యను విన్నవించేందుకు వాటర్‌బోర్డు టోల్‌ఫ్రీ నంబర్‌ 155313ని సంప్రదించేందుకు పలువురు కాల్‌ చేసినా అదీ పని చేయలేదు.

ఈ వార్తను కూడా చదవండి: MP Anil: మూసీ పునర్జీవంపై పార్లమెంట్‌లో ప్రస్తావన..


శుక్రవారం ఉదయం 9.30గంటల నుంచి 10.25గంటల వరకు గంట పాటు టోల్‌ ఫ్రీ నంబర్‌ పనిచేయలేదని వినియోగదారులు తెలిపారు. వాటర్‌బోర్డు వెబ్‌సైట్‌ ద్వారా, మొబైల్‌లోని వాటర్‌బోర్డు యాప్‌ ద్వారా నీటి ట్యాంకర్‌ బుక్‌ చేసుకునే సదుపాయం ఉన్నది. సాంకేతిక సమస్యలతో అవి పనిచేయకపోవడంతో శుక్రవారం రెండు, మూడు గంటల పాటు ట్యాంకర్‌ బుకింగ్‌లు జరగలేదు. కొద్దిసేపు టోల్‌ ఫ్రీ నంబర్‌ కూడా పనిచేయకపోవడంతో ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక కొందరు వినియోగదారులు తలపట్టుకున్నారు.


ఈవార్తను కూడా చదవండి: నాకు, రాహుల్‌కు మధ్య అగాధం వట్టిమాట

ఈవార్తను కూడా చదవండి: ముదిరిన పటాన్‌చెరు‌ కాంగ్రెస్ లొల్లి.. పీసీసీ కమిటీ ఏం చెప్పిందంటే..

ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్ నోట మహేష్ బాబు డైలాగ్.. రేవంత్ ప్రభుత్వానికి కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్

Read Latest Telangana News and National News

Updated Date - Feb 08 , 2025 | 09:20 AM