Mee Seva: సర్వర్ డౌన్‌తో నిలిచిన ‘మీ సేవలు’
ABN , Publish Date - May 06 , 2025 | 04:37 AM
తెలంగాణ వ్యాప్తంగా సోమవారం మీ సేవ ఆన్‌లైన్ సేవలు నిలిచిపోవడంతో నిర్వాహకులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మీ సేవ సెంటర్లలో ఇప్పటికే ఉన్న బయోమెట్రిక్ మిషన్లను తొలగిస్తూ కొత్త మిషన్లను అందుబాటులోకి తీసుకొచ్చే క్రమంలో సర్వర్‌ను పునరుద్ధరిస్తున్నారు.
ఆన్‌లైన్ పనిచేయక ఇబ్బందులు పడ్డ నిర్వాహకులు
బోయినపల్లి, మే 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ వ్యాప్తంగా సోమవారం మీ సేవ ఆన్‌లైన్ సేవలు నిలిచిపోవడంతో నిర్వాహకులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మీ సేవ సెంటర్లలో ఇప్పటికే ఉన్న బయోమెట్రిక్ మిషన్లను తొలగిస్తూ కొత్త మిషన్లను అందుబాటులోకి తీసుకొచ్చే క్రమంలో సర్వర్‌ను పునరుద్ధరిస్తున్నారు. దీంతో సేవలకు రోజంతా అంతరాయం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం మీ సేవలో అదనంగా కొన్ని సేవలను చేర్చేందుకు ఇటీవల చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కార్యక్రమాన్ని మొదలుపెట్టడంతో సర్వీసులకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఆన్‌లైన్‌లో సర్వీస్ సేవలను జత చేస్తున్న తరుణంలో నిర్వాహకులకు సంబంధించిన బయోమెట్రిక్ మిషన్ లాగిన్‌లో ఎర్రర్ అని వస్తుండడంతో మీ సేవల ద్వారా జరిగే సాధారణ కార్యకలాపాలకు విఘాతం కలిగింది. ప్రధానంగా విద్యార్థులకు సంబంధించిన స్కాలర్‌షి్‌పల బయోమెట్రిక్ మిషన్లు అయిన మోర్‌ఫో, మంత్ర, స్టార్‌టెక్, కోజెంట్‌లు పనిచేయకపోవడంతో సెంటర్లకు వచ్చిన వినియోగదారులు వెనుదిరిగిన పరిస్థితి ఏర్పడింది. కాగా, విద్యార్థుల సేవలతోపాటు రెవెన్యూ, రిజిస్ట్రేషన్, ఎడ్యుకేషన్, ఆర్టీఏ లాంటి సేవలు కూడా అందలేదని, అప్‌డేట్ కారణంగా రెండు నెలలుగా రావాల్సిన సర్టిఫై కాపీలు కూడా రాలేదని మీ సేవ నిర్వాహకులు వాపోయారు.
నకిలీల అడ్డుకట్టకు చెక్!
మీ సేవ సెంటర్లలో పాత బయోమెట్రిక్ మిషన్లను తొలగిస్తూ కొత్త మిషన్లను అందుబాటులోకి తీసుకొస్తున్న తరుణంలో కొందరు నిర్వాహకులు తమ ఐడీలను వేరే సెంటర్ల వారికి అప్పగించి నడిపిస్తున్నారు. అలాగే కొందరు ఒకే ఐడీపై వివిధ ప్రాంతాల్లో అక్రమంగా సెంటర్లు నడిపిస్తూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. దీంతోపాటు సరైన ధ్రువపత్రాలు లేకుండానే దరఖాస్తులకు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి వారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం మీ సేవ సెంటర్లలో కొత్త మిషన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Pahalgam Terror Attack: ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ.. ఎందుకంటే..
WAQF Amendment Bill 2025: వక్ఫ్ సవరణ బిల్లుపై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
TGSRTC: బస్ భవన్‌ను ముట్టడించిన కార్మికులు.. పరిస్థితి ఉద్రిక్తం
For Telangna News And Telugu News