Hot Chili Paste in Nizamabad School: టీచర్ కాదు సైకో
ABN , Publish Date - Aug 24 , 2025 | 04:10 AM
అల్లరి చేస్తున్న విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టేందుకు ఉపాధ్యాయులు వారిని మందలించి..
విద్యార్థులపై కారం కొట్టి చిత్ర హింసలు పెట్టిన ఉపాధ్యాయుడు
నిజామాబాద్ జిల్లా ఖుద్వాన్‌పూర్‌లో ఘటన
నందిపేట, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): అల్లరి చేస్తున్న విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టేందుకు ఉపాధ్యాయులు వారిని మందలించి.. దండించడం సహజమే. కానీ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మాత్రం విచక్షణ కోల్పోయి చిన్న పిల్లలని కూడా చూడకుండా విద్యార్థుల పట్ల సైకోలా ప్రవర్తించాడు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఖుద్వాన్‌పూర్ గ్రామంలోని మండల ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో 4 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శంకర్ అనే ఆ పాఠశాల ఉపాధ్యాయుడు 2, 3 తరగతులకు చెందిన 10 మంది విద్యార్థులపై మధ్యాహ్న భోజ న పథకం సిబ్బంది వద్ద నుంచి తెచ్చిన కారం చల్లి, ఆపై కొట్టి ప్రతాపం చూపెట్టాడు. అప్పట్నించి విధులకు డుమ్మా కొట్టిన శంకర్.. శనివారం పాఠ శాలకొచ్చాడని తెలుసుకున్న బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు రావడంతో తనపై దాడి చేస్తారేమోనని పరారయ్యాడు. అతనిపై దాడికి కూడా గ్రామస్థులు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఎంఈవో పాఠశాలకు వచ్చి విచారణ చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు
అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్
For More National News And Telugu News