Share News

T Jagga Reddy: కేసీఆర్‌ కుటుంబం అలీబాబా 40 దొంగల ముఠా

ABN , Publish Date - Aug 09 , 2025 | 03:49 AM

కేసీఆర్‌ కుటుంబం అలీబాబా 40 దొంగల ముఠా అని, అందులో కొత్త ప్రభాకర్‌ రెడ్డి ఒక సభ్యుడని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే టి. జగ్గారెడ్డి ఆరోపించారు.

T Jagga Reddy: కేసీఆర్‌ కుటుంబం అలీబాబా 40 దొంగల ముఠా

  • కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆ దొంగల ముఠాలో ఒక సభ్యుడు.. ఆయన రూ.వెయ్యి కోట్ల ఆస్తిని రైతులకిచ్చే దమ్ముందా

  • అదే ఆస్తి నాకుంటే గంటలో మొత్తం పంచేవాడిని

  • రాజకీయంగా ప్రభాకర్‌రెడ్డి ఎంత? ఆయన బతుకెంత?

  • టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి

హైదరాబాద్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌ కుటుంబం అలీబాబా 40 దొంగల ముఠా అని, అందులో కొత్త ప్రభాకర్‌ రెడ్డి ఒక సభ్యుడని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే టి. జగ్గారెడ్డి ఆరోపించారు. ‘‘నీకున్నంత ఆస్తి నాకుంటే గంటలో మొత్తం పంచేవాడిని. నీకున్న రూ.వెయ్యి కోట్ల ఆస్తిని రైతులకు పంచే సత్తా ఉందా..? రాజకీయంగా నువ్వెంత..? నీ బతుకెంత..? నా స్థాయికి నువ్వు ఏమాత్రం పనికిరావు. నీలాగ బీ- ఫామ్‌ కొనుక్కునే లీడర్‌ను కాదు. నువ్వు ప్యాకేజీ లీడరైతే.. నేను పబ్లిక్‌ లీడర్‌ను’’ అని ప్రభాకర్‌రెడ్డిపై ధ్వజమెత్తారు. గాంధీ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 30 శాతం కమీషన్‌ తిన్నందువల్లే హరీశ్‌రావు కాళేశ్వరం వద్దే నిద్రపోయారని అన్నారు.


అధికారంలో ఉన్నప్పుడు ప్రజాధనాన్ని దోచుకున్న దొంగలు.. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నిందలు వేస్తే ఎలా..? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ ఖజానాను దోచుకోవటంలో కేసీఆర్‌ కుటుంబం ఆరితేరిందని విమర్శించారు. ‘‘కాళేశ్వరం దోపిడీ, ఇసుక దందా, లిక్కర్‌ దందా, తెల్లవార్లు క్లబ్బులు, పబ్బులు నడిపింది మీరు కాదా..? చెరువులు మింగింది కేసీఆర్‌ కుటుంబం కాదా..? భూములు లాక్కున్నది ఆ కుటుంబం కాదా..? పెద్దమ్మ గుడి కమాన్‌ నుంచి మాదాపూర్‌ వరకు లిక్కర్‌ దందా చేసింది కేటీఆర్‌, జోగినపల్లి సంతోశ్‌ కుమార్‌ కాదా..? కేసీఆర్‌ పాలనలో రేవంత్‌రెడ్డిని సతాయించారు. ఆయన బెడ్‌ రూమ్‌లోకి కూడా పోలీసులను పంపింది మీరు కాదా..? ఇప్పుడు మీ బెడ్‌రూమ్‌లోకి రేవంత్‌రెడ్డి పోలీసులను పంపడం లేదు కదా..? మీ బెడ్‌ రూమ్‌లలోకి పోలీసులను పంపిస్తే ఆ నొప్పి ఏమిటో మీకు కూడా తెలుస్తుంది’’ అని జగ్గారెడ్డి అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అవి చూసి షాక్ అయ్యా: బండి సంజయ్

‘బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు’

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 09 , 2025 | 03:49 AM