Share News

Telangana Education Bandh: నేడు విద్యాసంస్థల బంద్‌

ABN , Publish Date - Jul 23 , 2025 | 05:05 AM

విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వామపక్ష..

Telangana Education Bandh: నేడు విద్యాసంస్థల బంద్‌
Telangana Education Bandh

  • విద్యా రంగంలో సమస్యల పరిష్కారం కోసం వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు

హైదరాబాద్‌ సిటీ, జూలై 22 (ఆంధ్రజ్యోతి): విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు బుధవారం విద్యా సంస్థల బంద్‌ పాటించాలని పిలుపునిచ్ఛాయి. ఈ మేరకు ఎస్‌ఎఫ్‌‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎస్ యూ, ఏఐడీఎస్‌ఓ, ఏఐఎస్‌బి, ఏఐఎఫ్‌‌డీఎస్‌, ఏఐపీఎస్ యూ తదితర సంఘాల బాధ్యులు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రిని నియమించాలని, ప్రైవేట్‌, కార్పోరేట్‌ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని, ఖాళీగా ఉన్న టీచర్‌, ఎంఈఓ, డీఈఓ, లెక్చరర్‌, ప్రిన్సిపాల్‌ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.

అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాలు, హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని.. గురుకులాల సమయాన్ని శాస్త్రీయంగా మార్చాలని, పెండింగ్‌ స్కాలర్‌ షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని విద్యా శాఖ అధికారులకు వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు. కాగా ఈ బంద్‌ పిలుపు నేపథ్యంలో బుధవారం తరగతులు ఉండవని.. పిల్లలను పంపించవద్దని పేర్కొంటూ ప్రైవేట్‌ పాఠశాలలు, కాలేజీల యాజమాన్యాలు మంగళవారం సాయంత్రమే తల్లిదండ్రులకు సందేశాలు పంపాయి. ఈఅంశం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టడం, కొన్ని స్కూళ్లకు సంబంధించి సందేశాలేవీ రాకపోవడంతో బుధవారం పిల్లలను బడికి, కాలేజీకి పంపాలా? వద్దా అని తల్లిదండ్రులు తర్జనభర్జనలో పడ్డారు.

ఈ వార్తలు కూడా చదవండి..

కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు

ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ

మరిన్ని జాతీయతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 23 , 2025 | 06:53 AM