MLC Kavitha: గొంతులేని వారికి గొంతుకై నిలుస్తున్నాం..
ABN , Publish Date - Mar 18 , 2025 | 08:04 AM
శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గొంతులేని వారికి గొంతుకై నిలుస్తున్నాం అంటూ ఆమె పేర్కొన్నారు. నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మాట్లాడుతూ.. సబ్బండ వర్గాలన్నింటినీ కలుస్తూ.. వారిలో చైతన్యం నింపుతున్నామన్నారు.
- తెలంగాణ కవులు, కళాకారుల వేదిక ఆవిర్భావ సభలో కవిత
హైదరాబాద్: సబ్బండ వర్గాలన్నింటినీ కలుస్తూ.. వారిలో చైతన్యం నింపుతూ, గొంతు లేనివారికి గొంతుకై నిలుస్తూ వేదికలను పంచుతున్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla Kavitha) అన్నారు. సోమవారం లక్డీకాపూల్‌లోని సెంట్రల్ కోర్టు హోటల్‌లో తెలంగాణ ప్రజా కవులు, కళాకారుల వేదిక ఆవిర్భావ సభ జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన కవిత వేదికను ప్రారంభించడంతోపాటు తెలంగాణ బీసీ కళాకారులతో తయారైన ఉద్యమ పాట ‘చైతన్యం రావాలె... చలో అడుగు వేయాలె’ బీసీ ఉద్యమ పాటను ఆవిష్కరించారు.
ఈ వార్తను కూడా చదవండి: Airplane: విమానం టేకాఫ్ సమయంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచే యత్నం
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీసీ బిల్లును రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాలకు వేర్వేరుగా పెట్టాలని తాము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం తమ పోరాటంతో కనీసం రెండు బిల్లులను ప్రవేశపెట్టడం తమ విజయంగానే భావిస్తున్నట్లు తెలిపారు. రిజర్వేషన్లు వెంటనే అమలయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ కళాకారులు శివశంకర్, మానుకొండ ప్రసాద్, రాచకొండ రమేష్, సంజీవ, మల్లిక్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ బిల్లు కవిత ఒత్తిడి వల్లే..
తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం తెచ్చిన బిల్లులు ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) చేసిన కృషి, ఒత్తిడి వల్లే సాధ్యమయ్యాయని యునైటెడ్ ఫూలే ఫ్రంట్ పేర్కొంది. సెంట్రల్ కోర్టు హోటల్‌లో బీసీ కుల సంఘాల ప్రతినిధులతో కలసి ఫ్రంట్ కన్వీనర్ బోళ్ల శివశంకర్ మాట్లాడారు. ఒకే బిల్లు పెట్టి కేంద్రానికి పంపి చేతులు దులుపుకుందామని ప్రభుత్వం భావిస్తే, దాన్ని గుర్తించిన ఎమ్మెల్సీ కవిత విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలకు వేర్వేరుగా బిల్లులు పెట్టాలని పోరాడారని పేర్కొన్నారు. కాగా బీసీ బిల్లులు ప్రవేశ పెట్టడం తెలంగాణ జాగృతి సాధించిన విజయంగా నాయకులు నవీన్ ఆచారి, అనంతుల ప్రశాంత్‌లు పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:
టన్నుల్లో స్మగ్లింగ్.. గ్రాముల్లో పట్టివేత
టికెట్ సొమ్ము వాపస్ కు 3 రోజులే గడువు
ఛీ.. మీరసలు మనుషులేనా.. ఇంత దారుణమా..
వారణాసిలో రోడ్డు ప్రమాదం.. సంగారెడ్డి వాసులు మృతి
Read Latest Telangana News and National News