Share News

Hyderabad: సిట్‌ ముందుకు చేరిన.. సృష్టి

ABN , Publish Date - Aug 20 , 2025 | 07:15 AM

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సరగసి మోసం కేసును సికింద్రాబాద్‌ గోపాలపురం పోలీసులు.. స్పెషల్‌ ఇన్వెస్టిగేటివ్‌ టీమ్‌ (సిట్‌)కు బదిలీ చేశారు. సోమవారంతో ఆ ప్రక్రియ పూర్తయినట్లు పోలీసులు తెలిపారు.

Hyderabad: సిట్‌ ముందుకు చేరిన.. సృష్టి

- నమ్రత సహా.. 25 మంది స్టేట్‌మెంట్స్‌ పరిశీలన

హైదరాబాద్‌ సిటీ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సరగసి మోసం కేసును సికింద్రాబాద్‌ గోపాలపురం పోలీసులు.. స్పెషల్‌ ఇన్వెస్టిగేటివ్‌ టీమ్‌ (సిట్‌)కు బదిలీ చేశారు. సోమవారంతో ఆ ప్రక్రియ పూర్తయినట్లు పోలీసులు తెలిపారు. అయితే సరగసి దందాలో ప్రధాన నిందితురాలు డాక్టర్‌ నమ్రత(Dr. Namrata), ఆమె కొడుకు జయంత్‌ కృష్ణ, మరో ముగ్గురు డాక్టర్లను కలిపి మొత్తం 25 మంది ఒప్పుకున్న నేర అంగీకార స్టేట్‌మెంట్‌,


నమ్రత నడిపిన సరగసి దందాలో ఎవరెవరి పాత్ర ఏమిటనే విషయాలపై సిట్‌ అధికారులు దృష్టి సారించినట్లు తెలిసింది. కేసును పూర్తిగా స్టడీ చేసి, ఓ అంచనాకు వచ్చిన సిట్‌ అధికారులు తమ దర్యాప్తును విశాఖలో సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం నుంచి ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఇతర రాష్ట్రానికి చెందిన దంపతులను నుంచి శిశువును కొనుగోలు చేసింది మొదలు.. వారితో నమ్రతకు ఉన్న సంబంధాలు..


city2.2.jpg

ఇప్పటి వరకు సుమారు 80 మంది చిన్నారులను విక్రయించేలా ఆమె సిద్ధం చేసుకున్న నెట్‌వర్క్‌పై పోలీసులు స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. అంతేకాకుండా ఇప్పటి వరకు నమ్రతమై తెలుగు రాష్ట్రాల్లో నమోదైన 10కి పైగా కేసులను సిట్‌ అధికారులు తెప్పించుకోనున్నట్లు తెలిసింది. మొత్తంమీద సృష్టి మోసం కేసులో సిట్‌ అధికారులు నేటినుంచి దర్యాప్తు ముమ్మరం చేయనున్నట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు...

‘కన్ఫర్డ్‌’లుగా 17 మంది సిఫారసు!

విద్యుత్‌ స్తంభాలపై కేబుల్‌ వైర్లను తీసేయండి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 20 , 2025 | 07:15 AM