Ponguleti: జూన్ 2 నుంచి స్లాట్ బుకింగ్ విధానం
ABN , Publish Date - May 27 , 2025 | 03:57 AM
రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ విధానాన్ని జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకొస్తున్నట్లు రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
రిజిస్ట్రేషన్లకు ‘ఆధార్-ఈ’ సంతకం అమల్లోకి
ప్రయోగాత్మకంగా కూసుమంచి, ఆర్మూర్‌లో: పొంగులేటి
హైదరాబాద్, మే 26 (ఆంధ్రజ్యోతి): రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ విధానాన్ని జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకొస్తున్నట్లు రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మరింత వేగవంతం చేసేలా ఆధార్-ఇ సంతకం అమల్లోకి తీసుకొస్తున్నామని చెప్పారు. తొలుత ప్రయోగాత్మకంగా ఖమ్మం జిల్లా కూసుమంచి, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దీన్ని అమల్లోకి తెచ్చామని వివరించారు.
సచివాలయంలో ఉన్నతాధికారులతో సోమవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అవినీతికి దూరంగా ఉంటూ.. ప్రజలకు పారదర్శకమైన సేవలను అందించాలనిఅన్నారు. ప్రభుత్వ ప్రతిష్ఠను పెంచేలా సబ్ రిజిస్ట్రార్ల పని తీరు ఉండాలని సూచించారు
Also Read:
సైంటిస్టులు అద్భుత ఆవిష్కరణ.. 'సూపర్-విజన్' లెన్స్‌తో చీకట్లోనూ చూసేయచ్చు..
సన్నగా, బలహీనంగా ఉన్నారా? ఫిట్‌నెస్ మంత్ర ఇదే..
For More Health News and Telugu News..