Sircilla News: అరెరే.. పోలీసుల నుంచి తప్పించుకోబోయి ప్రాణాలు కోల్పోయాడు..
ABN , Publish Date - Sep 19 , 2025 | 04:34 PM
బైక్ హెల్మెట్ పెట్టుకోలేదనో.. లైసెన్స్ లేదనో.. డ్రంక్ డ్రైవ్‌లో పోలీసుల నుంచి తప్పించుకోవాలనో కొందరు పారిపోయే ప్రయత్నం చేస్తుంటారు. మరికొందరు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ పోలీసులు వచ్చిన సమయంలో పారిపోతుంటారు.
సిరిసిల్ల, సెప్టెంబర్ 19: బైక్ హెల్మెట్ పెట్టుకోలేదనో.. లైసెన్స్ లేదనో.. డ్రంక్ డ్రైవ్‌లో పోలీసుల నుంచి తప్పించుకోవాలనో కొందరు పారిపోయే ప్రయత్నం చేస్తుంటారు. మరికొందరు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ పోలీసులు వచ్చిన సమయంలో పారిపోతుంటారు. పోలీసులకు దొరక్కుండా పారిపోతే వారి అదృష్టమే.. అలాకాకుండా ప్రాణాలే పోగొట్టుకుంటే.. ఇది ఘోరాతి ఘోరం అనే చెప్పాలి. కానీ, తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. పోలీసులకు దొరక్కుండా పారిపోయిన ఓ వ్యక్తి.. వాగులో శవమై తేలాడు. సంచలనం రేపుతున్న ఈ ఘటన సిరిసిల్లలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
పోలీసులకు దొరకకుండా పారిపోయిన వ్యక్తి, వాగు వద్ద శవమై లభించిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామ శివారులోని పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. పేకాడ ఆడుతున్న వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని, రూ.9130 నగదుతో పాటు, సెల్ ఫోన్లు, బైకులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఐదుగురు పారిపోయారు. కాగా, తప్పించుకుని పారిపోయిన వారిలో చాకలి రాజయ్య అనే వ్యక్తి రాత్రి వరకు ఇంటికి చేరుకోలేదు. దీంతో అతడు పరిగెత్తిన వైపు పోలీసులు వెతికారు.
ఈ క్రమంలో వెతుకుతున్న వారికి రాజయ్య శవం వాగులో లభ్యమైంది. దీంతో పోలీసులు.. అతని కుటుంబీకులకు సమాచారం అందించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. రాజయ్య మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. రాజయ్య మెడలో బంగారు గొలుసు ఉండేదని, అది కనపడకుండా పోయిందని ఆరోపించారు. రాజయ్య పోలీసులు పట్టుకుంటారనే భయంతోనే మృతి చెందాడా, లేక తోటి వారే హత్య చేశారా అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేయాలని పోలీసులను బాధితులు కోరారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Woman Funny Video: ప్లేటులో రెండు పానీపూరీలు తగ్గాయని మహిళ ఆగ్రహం.. చివరకు ఏం చేసిందో చూడండి..
AP Irrigation Projects: గత పాలనలో నిర్లక్ష్యమే.. ప్రాజెక్టులు ధ్వంసం: మంత్రి నిమ్మల
For More Telangana News and Telugu News..