Share News

Singareni Employee Dussehra Advance: సింగరేణి ఉద్యోగులకు దసరా ఆఫర్..

ABN , Publish Date - Sep 20 , 2025 | 05:54 PM

సింగరేణి ఉద్యోగులకు గుడ్ న్యూస్. దసరా పండుగ వేళ సింగరేణి సంస్థ యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. ఉద్యోగులకు దసరా పండుగను పురస్కరించుకుని పండుగ అడ్వాన్స్ చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం..

Singareni Employee Dussehra Advance: సింగరేణి ఉద్యోగులకు దసరా ఆఫర్..
Singareni Dussehra Advance

హైదరాబాద్, సెప్టెంబర్ 20: సింగరేణి ఉద్యోగులకు గుడ్ న్యూస్. దసరా పండుగ వేళ సింగరేణి సంస్థ యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. ఉద్యోగులకు దసరా పండుగను పురస్కరించుకుని పండుగ అడ్వాన్స్ చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణిలో పని చేస్తున్న అర్హులైన రెగ్యూలర్ సిబ్బందికి రూ. 25 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే, తాత్కాలిక కార్మికులకు రూ. 12,500 ఇవ్వనున్నట్లు యాజమాన్యం తెలిపింది. ఈ మొత్తం డబ్బులను ఈ నెల 23వ తేదీన జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.


సీఎంను కలిసిన సింగరేణి గుర్తింపు సంఘం ప్రతినిధులు..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సింగరేణి గుర్తింపు సంఘం ప్రతినిధులు కలిశారు. కొత్తగూడెం ఎమ్మెల్యే, యూనియన్ గౌరవాధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సింగరేణి అంశాలపై కీలక చర్చలు జరిపారు. సింగరేణి లాభాల వాటా 35 శాతం చెల్లించాలని సీఎంను విజ్ఞప్తి చేశారు. దీనికి సీఎం కూడా సానుకూలంగా స్పందించారు.


Also Read:

Tensions erupt in Vadodara: సోషల్ మీడియా పోస్ట్‌పై వడోదరలో తీవ్ర ఉద్రిక్తతలు.. 50 మంది నిర్బంధం

GST : వస్తు ధరల మార్పు .. సెప్టెంబర్ 22 నుంచి MRP తప్పక చెక్ చేయండి!

For More Telangana News and Telugu News..

Updated Date - Sep 20 , 2025 | 05:54 PM